Advertisement
Google Ads BL

సమంతా.. ఇది నిజామా?


గ్లామర్ క్వీన్ సమంతా అక్కినేని.. ఒక్కసారిగా ఇండియా వైడ్ హాట్ టాపిక్ గా మారిపోయింది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ మహిమ.. సమంత పేరు పలు భాషల్లో మార్మోగిపోతుంది. విమర్శకుల ప్రశంశలతో సమంత ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఏ సౌత్ హీరోయిన్ కి దక్కని అదృష్టం  సమంత ని ఫ్యామిలీ మ్యాన్ రూపంలో వరించింది. తమిళ్ నుండి కాస్త సమస్యలు ఎదుర్కున్నా.. ఫ్యామిలీ మ్యాన్ సీరీస్ మాత్రం బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఈ సీజన్ లో రాజి గా సమంత లుక్స్, ఆమె యాక్షన్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు. మరోపక్క సమంత కి నెట్ ఫ్లిక్స్ నుండి ఆఫర్ వచ్చింది అని, నెట్ ఫ్లిక్స్ లో మరో వెబ్ సీరీస్ కోసం సమంత ని సంప్రదిస్తున్నారనే టాక్ నడుస్తుంది.

Advertisement
CJ Advs

అయితే తాజాగా సమంత కి ఓ స్టార్ హీరో మూవీ నుండి బడా ఆఫర్ వెళ్లినట్లుగా చెప్పుకుంటున్నారు. కానీ సమంత కమర్షియల్ మూవీస్ చెయ్యడం లేదు.. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయి.. రెండు మూడు సాంగ్స్ లో స్టెప్స్ వేసే పాత్రల్లో చెయ్యలేను.. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలైతే ఓకె చేస్తానని ఆ దర్శకనిర్మాతలకు చెప్పినట్టుగా.. భారీ పారితోషకం ఇస్తా అన్నా సమంత ఒప్పుకోలేదని చెబుతున్నారు. కెరీర్ మొదలయ్యింది మొదలు గ్యాప్ తీసుకోని సమంత పెళ్లి తర్వాత స్టార్ హీరోల అవకాశాలు రావు అనుకుంటే.. ఇప్పుడు యంగ్ హీరోయిన్స్ కి షాకిచ్చే అవకాశాలతో దూసుకుపోతుంది. శాకుంతలం, పాన్ ఇండియా మూవీ అలాగే, తమిళ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ లో సమంత నటిస్తుంది.

Samantha .. is this True?:

Samantha akkineni rejected Big movie offer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs