Advertisement
Google Ads BL

సూపర్ స్టైలిష్ విజయ్ దేవరకొండ


విజయ్ దేవరకొండ అంటే ఒక క్రేజ్, ఒక బ్రాండ్.. ఆ లెవల్లో రౌడీ స్టార్ బ్రాండ్ పాపులర్ అయ్యింది. విజయ్ దేవరకొండ స్టయిల్ కి యూత్ ఫిదా. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో సూపర్ ఫామ్ లోకి వచ్చి స్టార్ హీరోల జతకి చేరిన విజయ్ దేవరకొండ క్రేజ్ నార్త్ లో భీభత్సమే. ఆ కారణంగానే విజయ్ దేవరకొండ టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో కలిసి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నారు. లైగర్ సినిమాతో బాలీవుడ్ లో క్రేజీ గా మారిపోయాడు. గ్లామర్ గర్ల్స్ అయినా, సీనియర్ హీరోయిన్స్ అయినా మీ క్రష్ ఎవరనగానే విజయ్ దేవరకొండ పేరే చెబుతున్నారు. అయితే మోస్ట్ డిజరబుల్ మ్యాన్ గా వరసగా క్రెడిట్ దక్కించుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడో సూపర్ స్టైలిష్ పిక్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు.

Advertisement
CJ Advs

బాలీవుడ్ లో క్రేజీ కేలెండర్ షూట్స్ కి కేరాఫ్ అడ్రెస్ అయిన డబు రత్నాని తన కెమెరా లో విజయ్ దేవరకొండని క్లిక్ మనిపించాడు. డబూ రత్నాన్ని కేలెండర్ షూట్ కోసం బాలీవుడ్ హీరోల సైతం ఇంట్రెస్ట్ చూపిస్తారు. అక్కడ బాలీవుడ్ లో డబూ రత్నాని కేలెండర్ కి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.. హీరోయిన్స్ ని అద్భుతంగా తన కెమెరాలో బంధించే డబూ రత్నాని హీరోలని సైతం అందరూ నోళ్లు వెళ్ళబెట్టాలా ఫోటో షూట్ చేస్తాడు. గత ఏడాది టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పిక్ తో అదరగొట్టేసిన డబూ రత్నాని ఇప్పుడు విజయ్ దేవరకొండ షూట్ తో ఇరగదీసాడు. రగ్గ్ డ్ అండ్ స్టైలిష్ లుక్ లో విజయ్ సెక్సీగా కనిపిస్తున్నాడు. మోస్ట్ స్టైలిష్ పర్సన్ విజయ్ దేవరకొండ ని బైక్ పై మరింత స్టైలిష్ గా చూపించాడు ఆయన. 

ప్రస్తుతం డబూ తీసిన విజయ్ దేవరకొండ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మరింది. ఇక ఈ ఫొటో షూట్ చాలా తొందరగా, చాలా క్వాలిటీగా జరిగింది. కొన్నేళ్ల నుండి నాకు నచ్చిన ఎంతో మంది స్టార్స్ మీ క్యాలెండర్ లో కనిపించారు. ఇప్పుడు నా కల నెరవేరింది అంటూ విజయ్ దేవరకొండ డబూ షూట్ పై స్పందించాడు

Dabboo Ratnani calendar 2021: Vijay Deverakonda is in beast boy mode:

Vijay Deverakonda vows on Dabboo Ratnani Calendar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs