2020 జూన్ 14 మధ్యాన్నం టివి ఛానల్స్ లో సడన్ గా బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఫుట్ ఆత్మహత్య అనే న్యూస్ చూసిన ఆయన ఫాన్స్ మాత్రమే కాదు.. బాలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కి పడింది. సుశాంత్ సింగ్ రాజ్ ఫుట్ ఆయన ఫ్లాట్ లోనే సుయిసైడ్ చేసుకోవడమనేది ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. సుశాంత్ సింగ్ మరణం తర్వాత ఆయన తండ్రి తన కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని.. ఫిర్యాదు చెయ్యడంతో సుశాంత్ సింగ్ మరణాన్ని అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి.. సుశాంత్ సింగ్ కేసుని సిబిఐ కి ట్రాన్స్ఫర్ చెయ్యడంతో.. ఈ కేసు డ్రగ్స్ కేసుగా మారింది. సుశాంత్ సింగ్ రాజపుట్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవరి సుశాంత్ కేసులో, డ్రగ్స్ వాడకంతో ఎన్ సీబీ విచారణతో ఆమె జైలుకి వెళ్ళింది. ఈకేసులో ఆమె సోదరుడు జైలు కి వెళ్ళాడు.
ఆ డ్రగ్స్ కేసు కాస్తా బాలీవుడ్ సెలబ్రిటీస్ మెడకి చుట్టుకుంది. గత డిసెంబర్ నుండి ఈ కేసు విషయాలను పెద్దగా పట్టించుకోలేదు. సుశాంత్ సింగ్ మరణంతో బాలీవుడ్ నెపోటిజంపై ప్రేక్షకులు సోషల్ మీడియాలో దండెత్తారు. స్టార్ కిడ్స్ కి సోషల్ మీడియాలోనే చుక్కలు చూపించారు. ఇక రీసెంట్ గా సుశాంత్ సింగ్ మేనేజర్, అలాగే ఈ కేసులో మరో కీలక వ్యక్తిని ఎంసీబీ అరెస్ట్ చేసింది. సుశాంత్ సింగ్ మరణించి ఏడాది గడిచినా ఆయన కేసు మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. దానితో అయన ఫాన్స్ సోషల్ మీడియాలో సుశాంత్ సింగ్ ని గుర్తు చేస్తూ హాష్ టాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు. టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ మరణాన్ని మరిచిపోలేక కంటతడి పెడుతున్నారు.