జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి నుండి అశోక్ గజపతి రాజు ని తప్పించారు. ఆయనపై కక్ష సాధింపు చర్యలో భాగంగానే మాన్సాస్ ట్రస్టు, సింహాచలం అప్పన్న దేవస్థానం బాధ్యతల నుంచి తప్పించారు. మాన్సాస్ ట్రస్టు, సింహాచలం అప్పన్న దేవస్థానం బాధ్యతలని.. సంచయిత కి అప్పజెప్పింది జగన్ ప్రభుత్వం. ఆ తర్వాత అశోక్ గజపతి రాజు ఈ విషయమై ఛైర్‌పర్సన్ నియామక జీవోను సవాలు చేస్తూ కోర్టు కెక్కారు. కొన్నాళ్లుగా ఈ విషయమై విచారణ జరిపిన కోర్టు నేడు తీర్పుని వెల్లడించింది.
జగన్ ప్రభుత్వం సంచయిత గజపతిరాజును ఛైర్‌పర్సన్‌గా నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. అంతేకాకుండా అశోక్ గజపతిరాజును తిరిగి మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా నియమానించాలంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం ఆ ట్రస్టుకు సంచయిత గజపతిరాజు ఛైర్మన్‌గా ఉన్న విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పుతో సంచయిత షాక్ గురిఅయ్యారు. ఇక మాన్సాస్ ట్రస్ట్ కేసులో హైకోర్టు తీర్పును టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి స్వాగతించారు. విజయనగరం గజపతి రాజులు దేశానికే ఒక రోల్ మోడల్. సేవ, త్యాగం, దానధర్మాలు చేయడం తప్ప చీమకు కూడా హానితలపెట్టని మనస్తత్వం వారిది. అలాంటి కుటుంబానికి చెందిన అశోక్ గజపతి రాజుపై కక్ష కట్టి మాన్సాస్ ట్రస్టు, సింహాచలం అప్పన్న దేవస్థానం బాధ్యతల నుంచి తప్పించారు. ఈ రోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు.. అంటూ స్పందించారు.