Advertisement
Google Ads BL

హ్యాపీ యానివెర్సరీ క్యూట్ కపుల్


ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న రామ్ చరణ్ - ఉపాసనల లు సుఖంగా ఉండడం కోసం మెగా ఫాన్స్ స్పెషల్ పూజ లు నిర్వహిస్తున్నారు. నిన్నటి నుండి రామ్ చరణ్ - ఉపాసన పెళ్లి రోజు సెలెబ్రేషన్స్ ని స్టార్ట్ చేసేసారు మెగా ఫాన్స్. ప్రేమించి పెద్దలని ఒప్పించి 2012 జూన్ 14న పెళ్లి పీటలెక్కింది ఈ జంట. మెగా ఫ్యామిలీ లో రామ్ చరణ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో.. అటు కామినేని ఫ్యామిలీ లో కూడా ఉపాసనకు అంతే ఇంపార్టెన్స్ ఉంది. పెళ్లి అయిన దగ్గర నుండి ఇటు ఫ్యామిలీని అటు అపోలో హాస్పిటల్ పనులని సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తున్న ఉపాసన దొరకడం తన అదృష్టమని, తనకి షూటింగ్ ఉన్నప్పుడు ఉపాసన ఫ్యామిలీ ని చూసుకుంటుంది అని, ఉపాసనకు హాస్పిటల్ పనులు ఉన్నప్పుడు తానూ ఇంటి విషయాల్లో కేర్ తీసుకుంటాను అని రామ్ చరణ్ చెబుతుంటాడు. 

Advertisement
CJ Advs

ఇక మెగా ఫ్యామిలీ లో బాగా కలిసిపోయిన ఉపాసన అక్కడ జరిగే ఏ పార్టీ అయినా, సెలెబ్రేషన్ అయినా దగ్గరుండి చక్కబెడుతుంది. తాజాగా రామ్ చరణ్ - ఉపాసన ఫ్లైట్ లో ఉన్న పిక్ ని తమ పెళ్లి రోజు సందర్భంగా షేర్ చేసింది ఉపాసన. ఇక ఈ జంటకి ఇంకా పిల్లలు లేరన్న చిన్న అసంతృప్తి తప్ప వారి ఫ్యామిలీ లైఫ్ చాలా హ్యాపీ గానే ఉంది. అయితే మెగా ఫాన్స్ లో ఆ అసంతృప్తి ఉన్నా.. తమకి పిల్లల్ని ఎప్పుడు కనాలో ఓ అవగాహన ఉంది అని.. ఇంకా పిల్లల విషయంలో ప్లాన్ చేసుకోలేదని ఒకసారి ఉపాసన చెప్పింది. ఇక నేడు నేడు 9 వ వివాహా వార్షికోత్సవం ఈ క్యూట్ మెగా కపుల్ చెర్రీ - ఉపాసనకు సినీజోష్ టీం తరుపున ఏ వెరీ హ్యాపీ యానివెర్సరీ 

Ram Charan - Upasana Wedding Anniversary Special:

Ram Charan - Upasana  9th Wedding Anniversary
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs