దేశం లో కరోనా పరిస్థితులు ఓ కొలిక్కి వస్తున్నాయి. లాక్ డౌన్ లు ముగిసి అన్ లాక్ ప్రక్రియలు మొదలు పెట్టాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. మెల్లిగా కరోనా కేసులు తగ్గు ముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇక సినిమా షూటింగ్స్ కూడా మొదలు కాబోతున్నాయి. ఇప్పుడిప్పుడే సినిమా వాళ్ళు షూటింగ్స్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు. హీరో - హీరోయిన్స్ కూడా దర్శకనిర్మాతల పిలుపు కోసం వెయిటింగ్. అయితే తాజాగా రష్మిక మందన్న ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. అంటే ఆమె నటిస్తున్న సినిమాల షూటింగ్ కోసం రష్మిక ఫ్లైట్ ఎక్కినట్లుగా తెలుస్తుంది.
హైదరాబాద్ లో పుష్ప పాన్ ఇండియా షూటింగ్ కోసమో, లేదంటే బాలీవుడ్ లో అమ్మడు చేస్తున్న సినిమాల కోసమో బయలు దేరింది. ఇక రష్మిక రీసెంట్ గా తన ఫ్రెండ్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుని అభిమానులతో పంచుకుంది. టైం అనేది చాలా విలువైనది. దాన్ని మీకు ఆనందం కలిగించే పని కోసం వాడుకోండి. లేదంటే డబ్బు, జ్ఞానం అందిచ్చే వాటిపైనైనా వెచ్చించండి. మీకు పనికిరాని, ఏరకంగానూ సంతృప్తి ఇవ్వని వాటి కోసం మాత్రం సమయాన్ని వృథా చేయకండి అంటూ తన ఫ్రెండ్ తనకి చెప్పినట్లుగా రష్మిక అభిమానులతో పంచుకుంటుంది.