Advertisement
Google Ads BL

నువ్వు-నేను హీరోయిన్ అనిత షాకింగ్ డెసిషన్


తెలుగులో ఉదయ్ కిరణ్ తోనూ, తరుణ్ తోనూ సినిమాలు చేసిన నువ్వు - నేను, నువ్వంటే నాకిష్టం ఫేమ్ అనిత తెలుగులో హీరోయిన్ గా మంచి అవకాశాలు రాక బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. అక్కడే సినిమాలు, సీరియల్స్ తో బిజీ అయిన అనిత బిజినెస్ మ్యాన్ రోహిత్‌ను 2013లో ప్రేమించి, పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత అనిత నటనకి స్వస్తి చెబుతుంది అనుకుంటే.. పెళ్లి తర్వాత కూడా నాగిన్ లాంటి సీరియల్స్ లో గ్లామర్ గా కనిపించి షాకిచ్చింది. ఆ తర్వాత కూడా అనిత తన నటనను కొనసాగించింది. ఇక లాక్ డౌన్ పండండి బిడ్డకి జన్మనిచ్చిన అనిత కొన్నాళ్లుగా తన కొడుకుతో ఎంజాయ్ చేస్తున్న క్యూట్ మూమెంట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు అనిత ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. అది తాను సినిమాలకు, సీరియల్స్ కి దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లుగా చెప్పి షాకిచ్చింది. ప్రస్తుతం తన కొడుకుకి తన అవసరం ఉంది అని, బిడ్డ పుట్టిన తర్వాత నుండి సినిమా పరిశ్రమకి దూరమవ్వాలనుకుంటున్నా అని, ప్రస్తుతం అయితే నటనను పక్కనబెట్టాలనుకుంటున్నాను. తర్వాత మళ్ళి సినిమాలు, సీరియల్స్ లో నటిస్తానా.. లేదా.. అనే విషయం ఇప్పట్లో చెప్పలేనని స్పష్టం చేసింది. దానితో ఆమె అభిమానులు బాగా ఫీలవుతున్నారు.

Anitha Hamsa Nandini shocking decision:

Nuvvu Nenu fame Anitha shocking decision
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs