Advertisement
Google Ads BL

అజిత్ మరోసారి అంత పవర్ ఫుల్ గా


కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ క్రేజ్ గురించి ప్రతేకించి మాట్లాడుకోవక్కర్లేదు. మరో స్టార్ హీరో విజయ్ తో నువ్వా - నేనా అని పోటీ పడే అజిత్.. కొన్నాళ్లుగా ఒకే వెర్షన్ కథలతో సినిమాలు చేస్తున్నాడు. దర్శకుడు శివ తో వరస సినిమాల్లో నటించిన అజిత్ చాలా సినిమాల్లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గానో, లేదంటే ఏదైనా రా ఏజెంట్ గానో కనిపిస్తున్నాడు. లుక్ కూడా దాదాపుగా ఒకటే కంటిన్యూ చేస్తున్నాడు. రీసెంట్ గా అజిత్ వినోద్‌ దర్శకత్వంలో వాలిమై చిత్రాన్ని చేస్తున్నాడు. లాక్ డౌన్ లేకపోతె వాలిమై ఎప్పుడో రిలీజ్ అయ్యేది. వాలిమై షూటింగ్ చాలావరకు హైదరాబాద్ లోనే జరిగింది. ఈ సినిమాలో టాలీవుడ్ హీరో కార్తికేయ పవర్ ఫుల్ విలన్ గా కనిపిస్తున్నాడు.

Advertisement
CJ Advs

ప్రస్తుతం లాక్ డౌన్ తో షూటింగ్ వాయిదా పడడడంతో దర్శకుడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. తాజాగా ఈ సినిమా దర్శకుడు వాలిమై లో అజిత్ పాత్ర గురించి రివీల్ చేసాడు. ఈ సినిమాలో అజిత్‌ సీబీసీఐడి అధికారిగా.. పవర్ ఫుల్ గా కనిపించనున్నారట. అయితే దర్శకుడు ఇంకా ఈ సినిమా గురించి.. మేము ముందు చాలా మంది సీనియర్‌ నటులతో చిత్రీకరించాం. కానీ గతేడాది కరోనా తర్వాత మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఆ సీనియర్ నటులు చిత్రీకరణలో పాల్గొనడానికి నిరాకరించారు. దానితో కొత్త నటీనటులతో ఆ సన్నివేశాలు తిరిగి చిత్రీకరించాం. ప్రస్తుతం వాలిమై కి సంబందించిన ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ మాత్రమే మిగిలి ఉంది. ఆ ఫైట్ సీన్ ని విదేశాలలో తెరకెక్కించాల్సిన అవసరం ఉంది.. విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు తొలగించగానే చిత్రీకరణ ప్రారంభిస్తాం.. అంటూ వాలిమై విషయాలను ఆయన అభిమానులతో పంచుకున్నారు.

Ajith To Play A CB CID In Valimai:

 Ajith Valimai Movie update 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs