Advertisement
Google Ads BL

రామ్ సినిమాలో నటించడం లేదు: తమిళ్ హీరో


హీరో రామ్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత వరస సినిమాలతో బిజీ అయ్యాడు. అయితే ఇస్మార్ట్ హిట్ తర్వాత రామ్ కి రెడ్ మూవీ ఇస్మార్ట్ అంతటి సక్సెస్ ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత రామ్ ఆచి తూచి కోలీవుడ్ దర్శకుడు లింగు స్వామితో కమిట్ అయ్యి బై లింగ్యువల్ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ మూవీ సెట్స్ మీదుంది. లాక్ డౌన్ తో ఆ సినిమా షూటింగ్ వాయిదా పడినా రేపో మాపో కొత్త షెడ్యూల్ మొదలు పెట్టుకోబోతుంది. ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి రామ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో విలన్ కేరెక్టర్ కోసం తెలుగు, తమిళ్ కి పరిచయం ఉన్న ఫేస్ ని తీసుకోబోతున్నారని అన్నారు.

Advertisement
CJ Advs

అందు కోసం సవ్యసాచి, నిశ్శబ్దం, బ్రీత్ వెబ్ సీరీస్ లో నెగెటివ్ షేడ్స్ లో నటించిన మాధవన్ ని రామ్ తో తలపడబోయే విలన్ కేరెక్టర్ కోసం లింగుస్వామి సంప్రదించాడని, మాధవన్ కూడా రామ్ కి విలన్ గా చెయ్యడానికి ఒప్పుకున్నాడనే టాక్ నడుస్తుంది. దానితో లైన్ లోకొచ్చిన మాధవన్.. రామ్ సినిమాపై క్లారిటీ ఇచ్చాడు. దర్శకుడు లింగుస్వామితో పనిచేయడాన్ని నేను ప్రేమిస్తాను.. ఎందుకంటే ఆయనొక చక్కటి అద్భుత మైన వ్యక్తి. కానీ, ఇటీవల తెలుగులో నేను విలన్‌గా నటస్తున్నట్టు వచ్చిన వార్తలో ఎలాంటి నిజం లేదు.. అంటూ రామ్ సినిమాలో తాను నటించడం లేదని స్పష్టతనిచ్చాడు.

Madhavan Give Clarity On Ram Pothineni - Lingusamy movie:

Not part of Lingusamy film with Ram Pothineni: Madhavan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs