Advertisement
Google Ads BL

సోషల్ మీడియా బాగా హెల్ప్ చేసింది


లాక్ డౌన్ పుణ్యమా అని చాలాకొద్ది మంది హీరోయిన్స్ సోషల్ మీడియాని నమ్ముకున్నారు. సినిమా షూటింగ్స్ లేక, అవకాశాలు రాక ఖాళీగా ఉన్న హీరోయిన్స్ ఇప్పుడు స్పెషల్ ఫోటో షూట్స్ అంటూ అదరగొట్టేస్తున్నారు. అందులో తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ కూడా ఉంది. సోషల్ మీడియాలో రకరకాల ఫోటో షూట్స్ తో అదరగొట్టడమే కాదు, గ్లామర్ గా ఫిట్ గా కనిపించేందుకు టైట్ ఫిట్ డ్రెస్సులతో రెచ్చిపోతుంది. జిమ్ వర్కౌట్ వీడియోస్ తో ఆఫర్స్ కోసం నానా తంటాలు పడుతుంది. తెలుగు హీరోయిన్స్ కి అవకాశాలు రావనే సామెత ఉందిగా.. ఈషా రెబ్బాని పట్టించుకునే తెలుగు నాధుడే లేకుండా పోయాడు. కానీ ఈషా రెబ్బ మాత్రం సోషల్ మీడియా ఫోజులకి గ్యాప్ ఇవ్వడం లేదు.

Advertisement
CJ Advs

మరి అమ్మడు కష్టానికి ఫలితం వేరే భాష నుండి తన్నుకొచ్చింది. కుంచాకో బోబన్ హీరోగా నటించనున్నమళయాలం మూవీలో ఈష రెబ్బకి ఆఫర్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా షెడ్యూల్ గోవా లో మొదలు కాబోతుంది. ఆ షెడ్యూల్ లో ఈషా రెబ్బ జాయిన్ కాబోతున్నట్లుగా చెప్పింది. మరి ఆ సినిమాలో తమిళ హీరో అరవింద్ స్వామి కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం ఈషా రెబ్బ రైఫిల్ షూటింగ్ .. బాక్సింగ్ నేర్చుకుంటున్నానని చెబుతుంది. ఏదైతేనేమి ఈషా రెబ్బా కి సోషల్ మీడియా ఫోటో షూట్స్ తెలుగులో అక్కరకు రాకపోయినా పరభాషల్లో పనికొస్తుంది.

Eesha Rebba Latest Photoshoots:

Eesha Rebba picks up archery and kickboxing
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs