Advertisement
Google Ads BL

శిల్పా శెట్టి భర్త మొదటి పెళ్లి-విడాకుల సీక్రెట్స్


బాలీవుడ్ నటి శిల్పా శెట్టి బిజినెస్ మ్యాన్ రాజ్ కుంద్రాని వివాహము చేసుకునేటప్పటికే.. రాజ్ కుంద్రాకు పెళ్లయింది. మొదటి భార్య కవిత తో విడాకులు తీసుకున్నాకే శిల్పా శెట్టి ని వివాహం చేసుకున్నాడు రాజ్. అయితే మొదటి భార్యకి విడాకులిచ్చి మరీ శిల్పా శెట్టి ని వివాహమాడిన రాజ్ కుంద్రా.. శిల్పా శెట్టి వలనే తన మొదటి భార్య కవితకి రాజ్ కుంద్రా విడాకులిచ్చాడు అనే ప్రచారం ఉంది. అయితే ఎప్పుడో 12 ఏళ్ళ క్రితం జరిగిన ఈ స్టోరీ ని రాజ్ కుంద్రా తాజాగా బయట పెట్టాడు. తాను కవిత తో విడిపోవడానికి శిల్పా శెట్టి కారణం కాదని చెబుతున్నాడు.

Advertisement
CJ Advs

తన మొదటి భార్య కవిత తన చెల్లెలి భర్త తో వివాహేతర సంబదం పెట్టుకున్న కారణంగానే తాము విడిపోయామని క్లారిటీ ఇచ్చాడు. కొన్నాళ్ల క్రితం తాము లండన్ లో ఉండేవాళ్లమని, తన చెల్లి ఆమె భర్త కూడా తమతో పాటే కలిసి ఉండేవారని, నేను బిజినెస్ రీత్యా టూర్ కి వెళ్ళినప్పుడు నా భార్య కవిత నా చెల్లెలి భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుంది అని.. తన వాళ్ళు చెప్పడంతో తన చెల్లెలని ఆమె భర్తని ఇండియా కి పంపేసినా.. నా మొదటి భార్య కవిత మాత్రం నా చెల్లెలి భర్త తో ఫోన్ మట్లాడేదని, దానికోసమే దొంగచాటుగా మొబైల్ కూడా కొనింది అని.. అది నా కంట పడడంతో చాలా బాధపడ్డా అని అందువలనే తామిద్దరం విడిపోయాం కానీ.. దీనిలో శిల్పా శెట్టి ప్రమేయం ఏం లేదని చెబుతున్నాడు.

శిల్పా శెట్టి కి మా గురించి అన్ని తెలుసు. నా మొదటి భార్య కవితకి విడాకులిచ్చాక శిల్ప ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నట్లుగా రాజ్ కుంద్రా చెప్పుకొచ్చారు.

Shilpa Shetty Husband's First Marriage-Divorce Secrets:

Raj Kundra says his ex-wife Kavita cheated on him
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs