Advertisement
Google Ads BL

సలార్ తర్వాతే ఆదిపురుష్ అంటున్న ప్రభాస్


ప్రభాస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ మళ్లీ మెల్లగా షూటింగ్స్ కి రెడీ అవుతున్నాయి. చాలా స్పీడు గా జరుగుతున్న ప్రభాస్ అప్ కమింగ్ ప్రాజెక్స్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా లాక్ డౌన్ పెట్టడంతో వాయిదా పడ్డాయి. అయినా ఆదిపురుష్ షూటింగ్ ఎలాగైనా చేద్దామని ఓం రౌత్ అనుకున్నా కుదరలేదు. ఇక తాజాగా లాక్ డౌన్స్ ముగిసి సడలింపులు మొదలు కావడంతో సినిమా ఇండస్ట్రీ మొత్తం షూటింగ్ కి రెడీ అవుతున్నాయి. అందులో ప్రభాస్ ఆదిపురుష్ తో పాటుగా సలార్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. అయితే ఆదిపురుష్ ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా షూటింగ్స్ మొదలు పెట్టాలనే ప్లాన్ లో ఉన్నారు. ముందు ముంబైలో రావణ్ పాత్రధారి సైఫ్ అలీ ఖాన్ మీద కొన్ని సన్నివేశాలుతో కొత్త షెడ్యూల్ లో పూర్తి చేస్తారని తెలుస్తుంది.

Advertisement
CJ Advs

అయితే ముంబై లో జరిగే కొత్త షెడ్యూల్ ఇంకా హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరిగే కొత్త షెడ్యూల్ లో ప్రభాస్ పాల్గొనడట. ప్రస్తుతం ఆదిపురుష్ సెట్స్ మీదకెళ్ళిన ఆదిపురుష్ టీం కి ప్రభాస్ అందుబాటులో ఉండడన్నమాట. ఎందుకంటే ప్రభాస్ సలార్ షూటింగ్ లో పాల్గొనడట. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సెట్స్ లో కి ప్రభాస్ అడుగుపెడతాడట. రామోజీ ఫిలిం సిటీలో స్పెషల్ గా వేసిన సెట్ లో సలార్ షూటింగ్ షెడ్యూల్‌ను ముగించుకుని ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్‌లో జాయిన్ అవుతాడట. ఇక ప్రస్తుతం ముంబై లో ఆదిపురుష్ సెట్ లో గ్రీన్ మాట్ మీదే రావణ్ సన్నివేశాలు తెరక్కించబోతున్నారట ఓం రౌత్.

Adi Purush shoot without Prabhas?:

Adi Purush readies for a short schedule?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs