17 ఏళ్లుగా టీఆరెస్ ఎమ్యెల్యేగా కొనసాగుతున్న ఈటల రాజేంద్ర నేడు టీఆరెస్ పార్టీకి, పార్టీ సభ్యత్వానికి, ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేసారు. టీఆరెస్ పార్టీ బి ఫామ్ ఇచ్చి ఉండొచ్చు కానీ.. తనని ఎమ్యెల్యేగా ప్రజలే గెలిపించారని, తనని రాజీనామా చెయ్యమని ప్రజలే ఆశీర్వదించారంటూ ఈటల రాజీనామా అంతంతరం మీడియాతో మట్లాడారు. గన్ పార్క్ లో అమరవీరులకు నివాళులర్పించిన ఈటెల తర్వాత శాసన సభ కార్యాలయంలో తన రాజీనామాని సమ్పరించారు. తన రాజీనామాతో హుజురాబాద్ లో కౌరవులకు - పాండవులకు యుద్ధం జరగబోతుంది అని కరోనాతో వందలమంది ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదంటూ టీఆరెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ఇక ఈటెల రాజేందర్ తన రాజీనామా తర్వాత ఈనెల 14 న ఢిల్లీ వెళ్లి బిజెపి పెద్దల సమక్షంలో బిజెపిలోకి చేరబోతున్నారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి బిజెపి పెద్దలని కలిసి చర్చించి ఈటల తన ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేసి మరీ బిజెపిలోకి ఎంటర్ అవుతున్నారు. తనతో పాటుగా ఏనుగుల రవీందర్ రెడ్డి, తులా ఉమా, కేశవ రెడ్డి, గండ్ర నళిని, అందే బాబు కూడా బీబీజేపిలోకి చేరబోతున్నట్లుగా ఈటల చెప్పారు.