గత ఏడాది లాక్ డౌన్ లో మూడు నెలల నుండి నాలుగు నెలల పాటు ఎలాంటి షూటింగ్స్ చెయ్యలేదు. లాక్ డౌన్ లో షూటింగ్స్ చెయ్యడానికి గవర్నమెంట్ పర్మిషన్ కూడా ఇవ్వలేదు. అందుకే వెండితెర ప్రేక్షకులకు సినిమాలు లేవు, బుల్లితెర ప్రేక్షకులని సీరియల్స్ లేవు. మూడు నెలల పాటు సీరియల్స్ షూటింగ్స్ కూడా జరక్కపోయేసరికి బుల్లితెర ప్రేక్షకులు బాగా బోర్ ఫీలయ్యారు. అటు టివిలో స్పెషల్ షోస్, జబర్దస్త్, ఢీ లాంటి షో లు కూడా లాక్ డౌన్ ప్రభావంతో ఆగిపోయాయి. కానీ ఈ ఏడాది లాక్ డౌన్ లో బుల్లితెర మీద ఏ సీరియల్ ఆగలేదు. అంటే షూటింగ్స్ కూడా జరిగినట్టే. పరిమిత సంఖ్యలో సీరియల్ షూటింగ్స్ కూడా చేపట్టారు. లాక్ డౌన్ పెట్టేస్తారేమో అనే ఆలోచనలో ఎక్కువ ఎపిసోడ్స్ షూట్ చేసుకుని పెట్టుకున్నారు దర్శకనిర్మాతలు.
అంతేకాదు.. లాక్ డౌన్ కన్నా ముందే జబర్దస్త్, ఢీ లాంటి షోస్ కూడా లెక్కకు మించి ఎపిసోడ్స్ షూట్ చేసుకుని ఉంచుకోవడంతో లాక్ డౌన్ పెట్టినా బుల్లితెర ప్రేక్షకులు ఈసారి బోర్ ఫీలవ్వలేదు. కారణం యాజిటీజ్ గా టైం కి సీరియల్స్ వచ్చేసాయి. కొన్ని ఎపిసోడ్స్ ని ఆయా స్టూడియోస్ లోనే సీరియల్స్ ని డైరెక్టర్స్ చిత్రీకరించారు. ఉదాహరణకు ఈటివి సీరియల్స్ ఎక్కువగా రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించగా, అన్నపూర్ణ స్టూడియోస్ నుండి వచ్చే సీరియల్స్ అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరించేసారు. అలా షూటింగ్స్ ఆగకుండా, ప్రేక్షకులకు బోర్ లేకుండా చేసారు ఈసారి. ఇక ప్రస్తుతం ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు సడలింపులు రావడంతో సినిమా షూటింగ్స్ కూడా మొదలు కాబోతున్నాయి.