Advertisement
Google Ads BL

సోను సూద్ కి పద్మవిభూషణ్‌.. బ్రహ్మాజీ ట్వీట్


ఇప్పుడు ఇండియా లో ఎక్కడా చూసినా సోను సూద్ పేరు మార్మోగిపోతోంది. సోను సూద్ కరోనా కష్ట కాలంలో దేవుడిలా మారిపోయాడు. కరోనా పేషేంట్స్, సహాయం కోసం వచ్చిన వాళ్ళకి లేదనకుండా తన వంతు సాయం చేస్తున్నాడు. గతేడాది వలస కూలీల కోసం ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేసిన సోనూసూద్‌.. ఇప్పుడు కరోనా బాధితుల కోసం ఆక్సిజన్‌ సిలిండర్లు, మందులను సరఫరా చేస్తున్నారు స్టార్ హీరోలే చెయ్యలేని పనిని సోను సూద్ ఆస్తులు అమ్మి చేస్తూ.. రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా పద్మ అవార్డుల కోసం కేంద్రం జనాల నుంచి స్పందనను కోరింది. పద్మ అవార్డులకు ఎవరైనా అర్హులు ఉంటే పేర్లు సూచించండని ప్రకటించడంతో.. టాలీవుడ్ బ్రహ్మాజి ముందుకు వచ్చారు. 

Advertisement
CJ Advs

సోనూ సూద్‌కి పద్మ విభూషణ్ ఇవ్వండి.. ఇవ్వాలని కోరుకునే వారు రీట్వీట్ చేయండని సూచించారు. దానితో సోను సూద్ కి పద్మ విభూషణ్ ఇవ్వాలంటూ ఆయన ఫాన్స్ డిమాండ్ చేస్తున్నాడు. దానితో సోను సూద్ స్పందించారు. బ్రదర్‌.. 135 కోట్ల మంది భారతీయుల ప్రేమను పొందడమే గొప్ప అవార్డు. ఇప్పటికే నేను ఆ అవార్డును పొందాను. మీరు చూపించిన ప్రేమకు ఎప్పటికీ కృతజ్ఞుడినే .. అంటూ ట్వీట్ చేసాడు.

Brahmaji took to his Twitter and nominates Sood for Padma Vibhushan:

Brahmaji nominates Sonu Sood for Padma Vibhushan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs