గోపీచంద్ - మారుతీ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ పక్క కమర్షియల్. ప్రతి రోజు పండగే వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తరువాత విలక్షణ దర్శకుడు మారుతి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో జీఏ2 పిక్చర్స్ - యూవీ క్రియేషన్స్ కలిసి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మాతగా పక్కా కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పక్క కమర్షియల్ టైటిల్ కు అటు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇటు సాధరణ వరుకు అంతటా అనూహ్యమైన స్పందన లభించడం విశేషం. ఇదే రీతిన ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన కొన్ని కీలక ప్రకటణలను సైతం దర్శకుడు మారుతి తనదైన శైలిలో విడుదల చేస్తూ వచ్చారు.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయింది. జూలై మొదటి వారంలో కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. గోపీచంద్ క్యారెక్టర్ ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. ఇప్పుడు విడుదలైన పోస్టర్లలో కూడా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో అపజయమే లేని కాంబినేషన్ లో పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది. గోపిచంద్ 29వ సినిమాగా, మారుతి 10వ సినిమాగా పక్కా కమర్షియల్ వస్తుంది. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.