Advertisement
Google Ads BL

ప్రభాస్ సినిమాలో రాశి ఖన్నాకి బంపర్ ఆఫర్


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో ఆఫర్ అంటే మాటలా? అసలు అలా న్యూస్ రావడమే అదృష్టం అనే రేంజ్ లో ప్రభాస్ ఉన్నాడు. వరస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో విపరీతమైన క్రేజ్, ఫెము ఉన్న ప్రభాస్ సినిమాలో చిన్న ఆఫర్ వచ్చినా అదృష్టం వరించినట్లే. ఇప్పుడు ఆ అదృష్టం బబ్లీ గర్ల్ రాశి ఖన్నా కి తగిలింది అనే టాక్ వినిపిస్తుంది. ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉండగా.. తర్వాత సలార్, ఆదిపురుష్ మూవీ అయ్యాక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ లో నటించబోతున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్ గా ఇప్పటికే బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తుంది.

Advertisement
CJ Advs

ఇప్పుడు ఆ సినిమాలో రాశి ఖన్నాని ఓ కీలక పాత్ర వరించింది అనే టాక్ నడుస్తుంది. ఇప్పటికే కీ రోల్ కోసం బాలీవుడ్ నుండి అమితాబ్ బచ్చన్ ని ఎంపిక చేసిన నాగ్ అశ్విన్, ఇప్పుడు రాశి ఖన్నాని కూడా ఎంపిక చేసాడని.. ఎందుకంటే రాశి ఖన్నా ఈమధ్యన తెలుగు, తమిళ సినిమాలతో పాటుగా బాలీవుడ్ లోనూ జెండా పాతడానికి రెడీ అవడంతో నాగ్ అశ్విన్ ఆ సినిమాలో కీలక పాత్ర కోసం రాశి ఖన్నాని సంప్రదిస్తున్నాడని అంటున్నారు. దీనిపై నాగ్ అశ్విన్ అండ్ టీం త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం.

Rashi khanna in Prabhas - Nag Ashwin Movie?:

Rashi Khanna to play a key role in Prabhas next film?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs