Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ: బాలయ్య కామెంట్స్


గత కొన్ని రోజులుగా టిడిపి పగ్గాలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతికి ఇమ్మని.. టిడిపి యువ కార్యకర్తలు చంద్రబాబు నాయుడిని బాహాటంగానే ఒత్తిడి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు.. బాలకృష్ణ, లోకేష్ లాంటి వాళ్ళని ఎన్టీఆర్ కి టిడిపి పగ్గాలను అప్పజెప్పాలంటూ టిడిపి కార్యకర్తలు గొడవ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా సదరు న్యూస్ యాంకర్ బాలయ్య ని డైరెక్ట్ గానే ఎన్టీఆర్ కి టిడిపి పగ్గాలు అప్పజెబుతారా? ఒకవేళ మీరు ఏమైనా టిడిపి పగ్గాలు చేపడతారా? అని అడిగిన ప్రశ్నకు బాలాకృష్ణ కాస్త హారిబుల్ సమాధానమే ఇచ్చారు.

Advertisement
CJ Advs

అంటే టిడిపి పగ్గాలు ఎవరికీ ఇవ్వొచ్చు, ఎవరికి ఇస్తే బావుంటుంది అనే దానిమీద ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి ఇష్టాయిష్టాలు వాళ్ళవి. దానిని మనం డిసైడ్ చేయలేము. సినిమాలు చేసే వాళ్ళు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తే మంచి జరుగుతుంది అనుకోవడం కరెక్ట్ కాదు. నేను ఎప్పుడూ టిడిపి పగ్గాలు కావాలని అడగలేదు. ఇక జూనియర్ ఎన్టీఆర్ టిడిపి కోసం పని చేస్తే మేలు జరుగుతుంది అనే ప్రశ్నకు బాలకృష్ణ ఏం చెప్పారో తెలుసా.. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ముందు అది ప్లస్ అయినా తర్వాత మైనస్ జరగొచ్చు. ముందు మైనస్ జరిగి తర్వాత ప్లస్ జరగొచ్చు.. అంటూ బాలయ్య ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఫై పొంతనలేని సమాధానాలు చెప్పారు. మరి చుక్కాని లేని టిడిపికి ఎన్టీఆర్ వస్తే మళ్ళీ కోలుకుంటుంది అని.. ప్రస్తుతం సుడిగుండంలో ఉన్న టిడిపికి ఎన్టీఆర్ ఒక్కడే దిక్కు అంటూ ప్రస్తుతం టిడిపిలో సీనియర్ నాయకులు కూడా అభిప్రాయపడుతుండడం గమనార్హం.

Ntr political entry: Balayya hot comments:

Balakrishna speaks about Junior NTR political entry
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs