Advertisement
Google Ads BL

ఎందుకలా రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు


బోల్డ్ బ్యూటీగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ ఫుట్ కి ఇప్పుడు అవకాశాలు సన్నగిల్లాయి. వెంకటేష్ వెంకిమామ సినిమాలో నటించినా పాయల్ కి క్రేజ్ కలిసి రాలేదు. సీనియర్ హీరోలకి పర్ఫెక్ట్ ఫిగర్ గా కనిపిస్తున్న పాయల్ ని ఆఖరుకి సీనియర్ హీరోలు కూడా పక్కనబెట్టేశారు. ఈమధ్యనే నాగ్ - ప్రవీణ్ సత్తారు మూవీలో పాయల్ ఒక ఐటెం సాంగ్ చేస్తుందని న్యూస్ రావడం దానిని పాయల్ రాజపుట్ ఖండించడం జరిగింది. ఇక ప్రస్తుతం అవకాశాలు లేని పాయల్ రాజపుట్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.. ఆమేరకు ఆమెతో చర్చలు జరుపుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది.

Advertisement
CJ Advs

కొన్నాళ్లుగా ఫుల్ డైటింగ్ తో సన్నగా నాజూగ్గా తయారైన పాయల్ రాజపుట్ సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోస్ షూట్స్ తో రెచ్చిపోతుంది. అవకాశాల కోసం సోషల్ మీడియాని నమ్ముకున్న పాయల్.. కాస్త క్రేజ్ వస్తే సినిమా అవకాశాలు వస్తాయని బిగ్ బాస్ లోకి వెళ్లబోతుంది అని అంటున్నారు. దానితో పాయల్ వెంటనే లైన్ లోకొచ్చి.. నేను బిగ్ బాస్ లోకి వెళ్లడం లేదు. ఇదంతా జస్ట్ రూమర్ అని తేల్చేసింది. ఇలాంటి పుకార్లలోకి అనవసరంగా తనని లాగొద్దని కాస్త గట్టిగానె ఈ రూమర్ పై స్పందించింది పాయల్ పాప. మరి బిగ్ బాస్ అంటే అవకాశాలు లేని వారే దానికి అర్హులని సామెత లేకపోలేదు. అందుకే తమ పేరు బిగ్ బాస్ కి లింక్ అవ్వగానే ఇలాంటి హీరోయిన్స్ ఉలిక్కిపడుతున్నారు.

Payal Rajput rubbishes rumours :

Bigg Boss Telugu 5: Payal Rajput rubbishes rumours of being part of the upcoming season
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs