Advertisement
Google Ads BL

జగన్.. అమిత్‌షాను అవే అడిగెన్


ఏపీ సీఎం జగన్ ప్రస్తుతం ఢిల్లీ టూర్ లో ఉన్నారు. ఢిల్లీ పెద్దల భేటీ తో జగన్ చాలా బిజీగా గడుపుతున్నారు. 

Advertisement
CJ Advs

తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం వైయస్‌.జగన్‌ భేటీ అయ్యారు. అమిత్‌షా దృష్టికి సీఎం తీసుకు వచ్చిన అంశాలు:

1.  రాష్ట్రంలో వివిధ ప్రాంతాలమధ్య సమతుల్యతో కూడిన అభివృద్ధికి, అభివృద్ది వికేంద్రీకరణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంమంత్రి అమిత్‌షాకు తెలియజేసిన ముఖ్యమంత్రి.

దీంట్లో భాగంగానే రాజధాని కార్యకలాపాలను వికేంద్రీకరిస్తూ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును చేస్తూ ప్రణాళిక వేసుకున్నామని తెలిపిన సీఎం.

ఆగస్టు 2020న దీనికి సంబంధించి చట్టాన్నికూడా తీసుకొచ్చామని తెలిపిన సీఎం.

కర్నూలు హైకోర్టును పెడుతూ రీ నోటిఫికేషన్‌ జారీచేయాలని కేంద్ర హోంమంత్రిని కోరిన సీఎం.

2019 ఎన్నికల మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు అంశాన్ని బీజేపీకూడా పెట్టిందని గుర్తుచేసిన సీఎం. 

2. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తిచేసిన ముఖ్యమంత్రి.

విభజన తర్వాత ఏర్పడ్డ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు కారణంగా రాష్ట్రం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని తెలిపిన సీఎం.

రాష్ట్రాన్ని బలోపేతం చేయాలని, అనేక రంగాల్లో స్వయం సమృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపించాల్సిన అవసరం ఉందని తెలిపిన సీఎం.

ప్రత్యేక హోదా ఇవ్వడంద్వారా కేంద్ర గ్రాంట్లు అధికంగా రాష్ట్రానికి వస్తాయని, ఆర్థిక భారం తగ్గుతుందని వెల్లడించిన సీఎం.

భారీగా పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగాల కల్పన జరగాలన్నా ప్రత్యేక హోదా చాలా అవసరమని తెలిపిన సీఎం. ప్రత్యేక హోదా ఇవ్వాలని మరోమారు విజ్ఞప్తిచేసిన సీఎం.

3.కొత్తగా నిర్మించనున్న మెడికల్‌కాలేజీలకు మంజూరు, అనుమతులు ఇవ్వాలని కోరిన సీఎం.

రాష్ట్రంలోని ప్రజలందరికీ అందుబాటులో మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలను అందించడానికి ప్రభుత్వం  చర్యలను ప్రారంభించిందని,  రాష్ట్ర విభజన తర్వాత, ఏపీలో మహానగరాలు లేవని,  అందుకనే కొత్తగా 13 మెడికల్‌కాలేజీల నిర్మాణాన్ని మొదలుపెడుతున్నామని, దీంతోపాటు ఇప్పుడున్న మెడికల్‌కాలేజీలను అభివృద్దిచేస్తున్నామని తెలిపిన సీఎం.

దీనివల్ల ప్రభుత్వరంగంలో అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని, గ్రామీణ, సబ్‌ అర్బన్‌ ప్రాంతాల్లోని ప్రజలకు మంచి ప్రయోజనం చేకూరుతుందని వివరించిన సీఎం.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 3 కాలేజీలకు మంజూరు, అనుమతి ఇచ్చిందని, దీనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, మిగిలిన కాలేజీలకూ అనుమతులు ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్నికోరామని, మెడికల్‌కాలేజీలతోపాటు నర్సింగ్‌కాలేజీలకు అనుమతులు ఇచ్చి, తగిన ఆర్థిక సహాయం చేయాల్సిందిగా విజ్ఞప్తిచేసిన సీఎం.

4.ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగంగా బియ్యం సబ్సిడీకింద రాష్ట్రప్రభుత్వానికి చెందిన సివిల్‌ సప్లైస్‌కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ. 3,229 కోట్ల బకాయిలను వెంటనే విడుదలచేయాలని, ఈమేరకు సంబంధిత శాఖపై ఒత్తిడి తీసుకురావాల్సిందిగా కోరిన ముఖ్యమంత్రి.

5 గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.4,652.70 కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉందని,  వెంటనే ఈడబ్బును చెల్లించేలా చూడాలని కోరిన సీఎం. అలాగే సంవత్సరంలో పనిదినాలను 100 నుంచి 150కి పెంచాలని కోరిన సీఎం.

6. స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం నిధుల కింద రావాల్సిన రూ. 529.95 కోట్ల బకాయిలు ఉన్నాయని, అలాగే 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన మరో రూ.497 కోట్లు కూడా పెండింగులో ఉన్నాయని, వీటిని వెంటనే విడుదలయ్యేలా చూడాలని కోరిన ముఖ్యమంత్రి.

7. విద్యుత్‌ సంస్కరణల్లో రాష్ట్రం ముందంజలో ఉందని, అలాగే సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిలోకూడా ముందంజలో ఉందని తెలిపిన సీఎం. కాని రాష్ట్ర విద్యుత్‌రంగ ఆర్థిక పరిస్థితి బాగోలేదని వివరించిన సీఎం. ఏపీకి తగిన సహాయం చేస్తానని కేంద్ర విద్యుత్‌శాఖ చెప్పిందని గుర్తుచేసిన ముఖ్యమంత్రి.

8. దిశ బిల్లుకు వెంటనే ఆమోదం తెలిపేలా చూడాలని సీఎంని కోరిన సీఎం.

9. ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ టైటిలింగ్‌ బిల్లు –2020కి ఆమోదం తెలిపేలా చూడాలని కోరిన సీఎం.

రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూముల రీ సర్వే ప్రారంభించామని, అన్ని రికార్డులను డిజిటలైజ్‌ చేస్తున్నామని తెలిపిన సీఎం. వెంటనే ఈబిల్లుకు ఆమోదం తెలిపేలా చూడాలన్న ముఖ్యమంత్రి.

10. విజయనగరం జిల్లా సాలూరు సమీపంలో 250 ఎకరాల భూమిని గిరిజన విశ్వవిద్యాలయం కోసం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని వెంటనే యూనివర్శిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కోరిన సీఎం.

CM Jagan Delhi tour:

AP CM YS Jagan Mohan Reddy to meet Amit Shah
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs