Advertisement
Google Ads BL

PSPK28 పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్బవుతున్న PSPK28 పై భారీ అంచనాలే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ తో హరిహర వీరమల్లు, శేఖర్ చంద్ర తో ఏకే రీమేక్ పూర్తి చేసాక హరీష్ మూవీ కి జంప్ అవుతారు. ప్రస్తుతం సెకండ్ వేవ్ కారణముగా షూటింగ్స్ క్యాన్సిల్ అవడంతో.. పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గరే కొడుకుతో కలిసి మ్యూజిక్ క్లాస్ లకి అటెండ్ అవుతున్నారు. అయితే ఈమధ్యన పవన్ కళ్యాణ్ PSPK28 లుక్ అంటూ పవర్ స్టార్ ఫాన్స్ కొన్ని పిక్స్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ ని సూపర్ స్టైలిష్ గా చూపించబోతున్నాడంటూ పోస్టర్స్ ని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.

Advertisement
CJ Advs

పవన్ PSPK28 ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ పై, అలాగే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న PSPK28 లుక్స్ ఫై మైత్రి మూవీ మేకర్స్ స్పందించింది. పవన్ ఫాన్స్ మీరు కంగారు పడొద్దు. అసలు PSPK28 టైటిల్ ని, ఫ‌స్ట్ లుక్‌నీ ఈ ఉగాదికి వ‌దులుదామ‌నుకున్నామ‌ని, అయితే… పరిస్థితులు అనుకూలించ‌లేద‌ని, కరోనా కారణంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేశాం. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా అనేక వార్తలు, ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి, ఈ సినిమా టైటిల్ ని ఓ శుభ‌ముహూర్తాన్న ప్ర‌క‌టిస్తామ‌ని, క‌చ్చితంగా ప‌వ‌న్ ఫ్యాన్స్‌ని స‌ర్‌ప్రైజ్ చేస్తామ‌ని, ఏ విషయమైనా అధికారిక ఖాతా నుండే షేర్ చేస్తామని మైత్రీ ట్వీట్ చేసింది.

Mythri reacts to PSPK28 viral pic:

Everything official will come exclusively from our handles at the right time! said Mythri in a statement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs