Advertisement

తెలంగాణాలో లాక్ డౌన్ - వెసులుబాటు


తెలంగాణాలో గత నెలరోజులు లాక్ డౌన్ అమలులో ఉంది. మే 11 నుండి కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణాలో పటిష్టంగా లాక్ డౌన్ అమలు చేస్తుంది. తర్వాత మే 21 నుండి మే 30 వరకు, మే 31 నుండి జూన్ తొమ్మిది వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. లాక్ డౌన్ లో కరోనా కేసులు తగ్గుదల, పోజిటివిటి రేటు పెరగడంతో లాక్ డౌన్ ఆంక్షల సడలింపు సమయాన్ని పెంచుతూ పోతుంది. మొదట్లో కేవలం నాలుగు గంటల సడలింపు ఇచ్చిన ప్రభుత్వం, మే 31 నుండి జూన్ తొమ్మిది వరకు మధ్యాన్నం రెండు గంటవరకు ఆ సమయాన్ని పెంచింది. ఇక రేపు 9 తో లాక్ డౌన్ ముగుస్తుండడంతో తెలంగాణ కేబినెట్ మరోసారి భేటీ అయ్యింది.

Advertisement

కేసీఆర్ పలువురు మంత్రులు పాల్గొన్న ఈ కేబినెట్ మీటింగ్ లో తెలంగాణలో మరో పది రోజుల పాటు లాక్ డౌన్ పెంచుతున్నట్టుగా ప్రకటించింది. కాకపోతే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఆంక్షల సడలింపులు ఉంటాయని, సాయంత్రం 6 గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు కఠిన లాక్ డౌన్ నిభందనలు అమలులో ఉంటాయని, లాక్ డౌన్ అతిక్రమిస్తే  చర్యలు తప్పవని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే కరోన ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సడలింపులు టైం ఎప్పటిలాగే అంటే మద్యాన్నం 1 గంట వరకే సడలింపులు ఉంటాయని, ఆ తర్వాత లాక్ డౌన్ అమలవుతుంది అని ప్రకటించారు. 

కరోనా కేసుల తగ్గుదల, మరణాల తగ్గుదలతో కేసీఆర్ ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులపై కీలక నిర్ణయాలను తీసుకుంది. 

Telangana Lockdown Extension:

Telangana Lockdown Extension till June 20th with 12 hours 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement