నిన్న బాలకృష్ణ తన పుట్టిన రోజు వేడుకలు చెయ్యొద్దు.. పుట్టిన రోజు సెలెబ్రేషన్స్ అంటూ నాకు విషెస్ చెప్పడానికి ఎవరూ ఇంటికి రావొద్దు.. కరోనా టైం లో ఇంట్లోనే ఉండండి సేఫ్ గా ఉండండి.. నా బర్త్ డే వేడుకలకి దూరంగా ఉండండి అంటూ లెటర్ రాయగానే ఫాన్స్ డిస్పాయింట్ అయ్యారు. బాలయ్య బాబు పుట్టిన రోజు ఈ ఏడాది అఖండ నుండి ఏదో ఒక సర్ప్రైజ్ తో పాటుగా, ఆయన కొత్త సినిమాల అప్ డేట్స్ ఉంటాయని సంబంరపడిన ఫాన్స్ ఉసూరుమన్నారు. ఆయన లెటర్ చూసి ఆయన కొత్త సినిమాల అప్ డేట్స్ కూడా ఉండవేమో, అలాగే అఖండ నుండి ఎలాంటి హడావిడి ఉండదేమో అనుకున్నారు. మే28 నే విడుదల కావాల్సిన అఖండ మూవీ సెకండ్ వేవ్ తో రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది.
అయితే తాజాగా బాలయ్య పుట్టిన రోజుకి ఒక రోజు ముందే అంటే జూన్ పదిన బాలయ్య బర్త్ డే అయితే జూన్ తొమ్మిది సాయంత్రమే అఖండ నుండి బాలకృష్ణ పోస్టర్ రాబోతున్నట్లుగా దర్శకుడు బోయపాటి ప్రకటించారు. A new birthday poster will be released Tomorrow at 4:36PM on the occasion of Nandamuri Balakrishna gari Birthday. అంటూ బోయపాటి సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. అంటే రేపు సాయంత్రం, 4:36PM కి అఖండ నుండి బాలయ్య ఫాన్స్ కి ట్రీట్ రాబోతుంది. మరి బర్త్ డే రోజున మైత్రి మూవీ మేకర్స్ - గోపీచంద్ మలినేని సినిమా అనౌన్సమెంట్ కూడా వస్తుందేమో చూడాలి.