ఎన్టీఆర్ ఇప్పుడు వరస పాన్ ఇండియా మూవీస్ తో తన మర్కెట్ ని పెంచేసుకుంటున్నాడు. ఆర్.ఆర్.ఆర్ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొట్టబోతున్న ఎన్టీఆర్ తన తర్వాత సినిమాని కొరటాలతో, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో కమిట్ అయ్యాడు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత కూడా రెండు పాన్ ఇండియా మూవీస్ నే ఎన్టీఆర్ లైన్ లో పెట్టాడు. అయితే ఆర్.ఆర్.ఆర్ లో హాలీవుడ్ భామతో రొమాన్స్ చేస్తున్న ఎన్టీఆర్.. కొరటాల శివ మూవీలో కియారా అద్వానీతో రొమాన్స్ చేయబోతున్నాడనే టాక్ నడుస్తుంది. దాదాపుగా కియారా నే ఎన్టీఆర్ - కొరటాల కాంబో హీరోయిన్ గా ఫిక్స్ అంటున్నారు.
ఇక ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో చెయ్యబోయే NTR31 కి కూడా హీరోయిన్ ని లాక్ చేయబోతున్నారట. అది కూడా బాలీవుడ్ భామనే అంటున్నారు. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ని NTR31 కోసం పట్టుకొస్తున్నారట. జాన్వీ కపూర్ కి ఇప్పటివరకు టాలీవుడ్ లో తెరకెక్కే సినిమా ఆఫర్స్ మాత్రమే వెళ్లాయి. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ తో పాన్ ఇండియా మూవీ అంటున్నారు. అందుకే జాన్వీ కపూర్ కూడా పాన్ ఇండియా మూవీతోనే టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వాలని కల. ఇప్పుడు ఎన్టీఆర్ తో ఆ కల తీరబోతుంది అని.. అందుకే జాన్వీ కపూర్ ప్రశాంత్ నీల్ ప్రపోజల్ కి ఒప్పేసుకోవడం ఖాయం అంటున్నారు ఎన్టీఆర్ ఫాన్స్. ఇక ఎప్పుడో మొదలు కాబోయే ఈ సినిమాకి జాన్వీ ని లాక్ చేసే పెట్టుకుంటే మరో హీరో జాన్వీ ని తీసుకోవడానికి కుదరదు అని ప్లాన్ చేస్తుందట మైత్రి మూవీ మేకర్స్.