Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ కన్నా ముందు అల్లు అర్జున్


ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ముంచేసిన దర్శకుడు బుచ్చి బాబు.. మరోసారి మైత్రి మూవీ మేకర్స్ లోనే సినిమా చెయ్యడానికి కమిట్ అయ్యాడు. ఉప్పెన సక్సెస్ తొలి బుచ్చిబాబు స్టార్ హీరోలకి దగ్గరయ్యాడు. అందులో మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ తో సినిమా ఉంటుంది అని బుచ్చిబాబు అధికారికంగా ట్వీట్ చెయ్యడంతో బుచ్చి బాబు రెండో సినిమా ఎన్టీఆర్ తోనే చేస్తాడని.. ఈలోపు మరే చిన్న సినిమా చేసే ఉద్దేశ్యం బుచ్చిబాబుకి లేదు అనుకున్నారు. కానీ బుచ్చిబాబు మాత్రం ఎన్టీఆర్ కన్నా ముందే మరో మెగా హీరోతో సినిమా చెయ్యాలనుకుంటున్నాడట.

Advertisement
CJ Advs

ఉప్పెన సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ కి ఉప్పెన సినిమా చూపించి శెభాష్ అనిపించుకున్న బుచ్చిబాబు అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టడమే కాదు.. పుష్ప 2 పార్ట్శ్ తర్వాత అల్లు అర్జున్ కొరటాలతో సినిమా చేస్తాడని అంటున్నా.. కొరటాల - ఎన్టీఆర్ మూవీ పూర్తయ్యేవరకు బన్నీ వెయిట్ చెయ్యాలి. ఈలోపులో బుచ్చిబాబు అల్లు అర్జున్ కి కథ చెప్పి ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నాడట. అది కూడా మైత్రి వారు ప్రోద్భలంతో అంటున్నారు. ఎన్టీఆర్ తో చెయ్యాలంటే మూడేళ్లు ఆగాలి.. అదే బన్నీ తో కమిట్ అయితే ఒక ఏడాది ఆగితే సరిపోతుంది. ఇది బుచ్చిబాబు ప్లాన్. అందుకే బుచ్చిబాబు మైత్రి మూవీస్ వారు అల్లు అర్జున్ ని ఒప్పించే పనిలో పడ్డారని వినికిడి. 

Buchi Babu Next: NTR Or Allu Arjun? :

Buchi Babu in talks with Allu Arjun?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs