Advertisement
Google Ads BL

ఓటిటి రిలీజ్ పై గుడ్ లక్ మేమెర్స్ క్లారిటీ


జూన్ 3 న విడుదల కావల్సిన కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి.. ప్రస్తుతం థియేటర్స్ బంద్ వలన, సెకండ్ వేవ్ వలన వాయిదా పడింది. అయితే గత కొన్ని రోజులుగా కీర్తి సురేష్ సినిమాల వలె ఈ సినిమా కూడా ఓటిటి లోనే విడుదల కాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. జగపతి బాబు, అది పిన్ని శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్న గుడ్ లాక్ సఖి మీద మంచి అంచనాలే ఉన్నాయి. కీర్తి సురేష్ లుక్స్, ఆమె కేరెక్టర్ కొత్తగా ఉండడం ఇవన్నీ సినిమాపై అంచనాలు పెరిగేలా చేసాయి. అయితే కీర్తి సురేష్ గత చిత్రాలైన పెంగ్విన్, మిస్ ఇండియా లాగా గుడ్ లాక్ సఖి కూడా ఆమెజాన్ ప్రైమ్ నుండి విడుదల కాబోతుంది అంటూ ప్రచారం జరిగుతుంది.

Advertisement
CJ Advs

అయితే ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ గుడ్ లక్ సఖి మేకర్స్ సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. గుడ్ లాక్ సఖి ఓటిటి నుండి నేరుగా విడుదల కాబోతుంది అనే న్యూస్ కరెక్ట్ కాదని, ఆ వార్తలన్నీ రూమర్స్ అని, దయచేసి పుకార్లని నమ్మొద్దు.. అలాంటి రూమర్స్ స్ప్రెడ్ చెయ్యొద్దు అని.. గుడ్ లక్ సఖి కేవలం థియేటర్స్ లోనే విడుదల చేస్తాము.. ఒకవేళ ఈ సినిమా గురించి కొత్త అప్ డేట్ ఏమైనా ఉంటే మేమె తెలియజేస్తామని గుడ్ లక్ సఖి మేకర్స్ ట్వీట్ చెయ్యడంతో.. ఈ సినిమా కూడా ఓటిటిలో రిలీజ్ కావడం లేదనేది తేలిపోయింది.

Good Luck Sakhi issued a clarification:

Keerthy Suresh Good Luck Sakhi producers deny OTT release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs