Advertisement
Google Ads BL

ఇకపై సమంత కోసమే


పెళ్లి తర్వాత రాకెట్ కన్నా స్పీడు గా దూసుకుపోవడమే కాదు.. తాను చేస్తున్న పాత్రలతో సమంత పెళ్లి తర్వాత ఎప్పటికప్పుడు ప్రత్యేకతని చూపిస్తుంది. నటనలో నెంబర్ వన్ గానే కాదు గ్లామర్ పరంగా ఎక్కడ తగ్గని సమంత ఇప్పుడు డిజిటల్ మీడియాని ఊపేస్తోంది. కాజల్, తమన్నా, శృతి హాసన్ వల్ల కానిది సమంత ఒకే ఒక్క వెబ్ సీరీస్ తో చేసి చూపెట్టింది. సమంత అనడం కాదు కానీ.. సమంత కెరీర్ లోనే ఫ్యామిలీ మ్యాన్ 2 రాజి పాత్ర ఓ మైలు రాయిలా నిలిచిపోతుంది. అలాంటి పెరఫార్మెన్స్ చూసాక సమంత పై మరింత క్రేజ్ పెరిగిపోయింది.

Advertisement
CJ Advs

పెళ్లి తర్వాత స్టార్ అవకాశాలు తగ్గాయి.. లేదంటే సమంతానే లైట్ తీసుకుందో తెలియదు కానీ.. ఇప్పుడు దర్శకనిర్మాతలు సమంత తో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చెయ్యాలని ఫిక్స్ అవుతున్నారు. ఇప్పటికే శాకుంతలం పాన్ ఇండియా మూవీ చేస్తున్న సమంత ఆ చిత్రంపై అంచనాలు పెరిగేలా చేసింది.  ఈ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ లో చేసిన రాజి పాత్రని ఒప్పుకుని.. గట్స్ ఉన్న అమ్మాయిలా అదరగొట్టెయ్యడంతో.. సమంత ఒప్పుకునే సినిమాలపై ఇపుడు స్పెషల్ క్రేజ్, అండ్ హైప్ కూడా వచ్చేస్తున్నాయి. 

దానితో సమంత ని మెయిన్ లీడ్ లో పెట్టి కథలు రాసేస్తున్నారట. సమంత తో సినిమా చేసి హిట్ కొట్టాలని ఇప్పుడు దర్శకులు రెడీ ఐపోతున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా క్రేజ్ లో  ఉంది. అంటే అలాంటి కథలే సమంత ని వెతుక్కుంటూ వస్తాయన్నమాట.

Samantha signs mythological films?:

Samantha, Raji will always be special
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs