Advertisement
Google Ads BL

జులై లో కష్టమే.. దసరా కి ప్లాన్


ప్రభాస్ - పూజ హెగ్డే కాంబోలో రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ ఎప్పటికప్పుడు మీడియాలో న్యూస్ అవుతూనే ఉంది. అయితే ఆ సినిమాకి ఆర్.ఆర్.ఆర్ కి పుష్ప లాంటి సినిమాలకున్న క్రేజ్ తో కాదు. రాధేశ్యామ్ పబ్లిసిటీ విషయాలతో పాటుగా ప్రభాస్ లుక్స్ విషయంలోనూ రాధేశ్యామ్ పై ప్రభాస్ ఫాన్స్ కి బోలెడన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ఇక ఈ సినిమా జులై 30 న విడుదలకు డేట్ ఇచ్చారు మేకర్స్. కానీ ఖచ్చితంగా జులై లో అయితే రాధేశ్యామ్ వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే రాధేశ్యామ్ లో ఇంకో సాంగ్ చిత్రీకరణ మిగిలి ఉంది.

Advertisement
CJ Advs

అలాగే కొన్ని కీలక సన్నివేశాల రీ షూట్స్ కూడా చేయాలి కాబట్టి రాధేశ్యామ్ అనుకున్న డేట్ కి రిలీజ్ అసాధ్యం అంటున్నారు. అయితే సెకండ్ వేవ్ తగ్గి.. మళ్ళీ సాధారణ పరిస్థితులు ఓ కొలిక్కి రావడంతో రాధేశ్యామ్ షూటింగ్ ని తిరిగిమొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారట టీం సభ్యులు. సెకండ్ వేవ్ తగ్గగానే ఓ పది రోజు షెడ్యూల్ చెయ్యాలని అనుకుంటున్నారట. ఇక షూటింగ్ అవ్వాలి, విఎఫెక్స్ పనులు పూర్తవడానికి సమయం పడుతుంది కాబట్టి రాధేశ్యామ్ సినిమాని జులై 30 నుండి దసరాకి షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట. సినిమా రిలీజ్ వాయిదా ప్రకటన, మళ్ళీ కొత్త రిలీజ్ డేట్ ప్రకటన ఒకేసారి ఇవ్వాలని చూస్తున్నారట రాధేశ్యామ్  మేకర్స్.

Radhe Shyam Biggest update :

Prabhas Radhe Shyam Release Postponed?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs