పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కబోతున్న PSPK28 పై ట్రేడ్ లో మంచి అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే అదే కాంబోలో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ఉంది కాబట్టి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఏకే రీమేక్ షూటింగ్స్ ని లైన్ లో పెట్టి అవి పూర్తి కాగానే PSPK28 సెట్స్ మీదకి వెళ్ళిపోతాడు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ వలన షూటింగ్ ఆగడం, అటు హారిష్ కూడా పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ ని చెక్కుతున్నాడట. పవన్ ఎప్పుడు వస్తే అప్పుడు ఎలాంటి గ్యాప్ కానీ, ఆటంకాలు లేకుండా PSPK28 షూటింగ్ ని పరిగెత్తించాలనే ప్లాన్ లో ఉన్నాడట. అందుకోసం నటుల ఎంపిక కూడా చేపట్టాడట.
హీరోయిన్ గా పూజ హెగ్డే ని హరీష్ పవన్ కోసం సెలెక్ట్ చేసాడనే న్యూస్ ఉండగా.. ఈరోజు ట్విట్టర్ లో #PSPK28 హాష్ టాగ్ తో పవన్ ఫాన్స్ హరీష్ - పవన్ మూవీని ట్రేండింగ్ లో ఉంచారు. అయితే తాజాగా పవన్ - హరీష్ శంకర్ - మైత్రి మూవీ మేకర్స్ కాంబోలో తెరకెక్కబోయే PSPK28 మూవీ లుక్ అంటూ అందులో పవన్ కళ్యాణ్ క్లాస్ గా కనిపిస్తుంటే.. హీరోయిన్ గా పూజ హెగ్డే ని పెట్టి ఫ్యాన్ మెడ్ పోస్టర్ ని ట్రెండ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫాన్స్. పవన్ - పూజ హెగ్డే తొలిసారి కనిపిస్తే ఎలా ఉంటుందో ఆ పోస్టర్ లో చూడొచ్చు. అది ఫ్యాన్ మేడ్ పోస్టర్ అయినప్పటికీ.. పవన్ ఫాన్స్ దానిని తెగ వైరల్ చేస్తున్నారు.