ఈమధ్యనే తాను ప్రేమలో ఉన్నట్లుగా.. తాను ప్రేమించిన ఆ అమ్మాయి హైదెరాబాదీ అమ్మాయి అని, తాను సింగిల్ కాదంటూ చేపి షాకిచ్చిన అడివి శేష్.. ఇప్పుడు తాను నటిస్తున్న సినిమా విశేషాలను ఓ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కుతోన్న అడవి శేష్ లేటెస్ట్ చిత్రం మేజర్ మూవీ జులై లో విడుదల కావాల్సి ఉండగా.. ఆ సినిమాని కరోనా సెకండ్ వేవ్ వలన పోస్ట్ పోన్ చేస్తున్నట్లుగా మేజర్ టీం ప్రకటించింది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న మేజర్ మూవీ రిలీజ్ వాయిదా పడొచ్చనే విషయం సెకండ్ వేవ్ మొదలైనప్పుడే అర్ధమైంది అంటున్నాడు అడివి శేష్.
అంటే ఈ సినిమా షూటింగ్ జస్ట్ 10 డేస్ లో పూర్తయ్యేదట. కానీ మేజర్ లోని కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ కోసం మిలటరీ ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపేందుకూ కరోనా సెకండ్ వేవ్ టైం లో అనుమతి లభించలేదు. అలాగే సెకండ్ వేవ్ మొదలవుతున్నప్పుడే మేజర్ సినిమా టెక్నీకల్ సిబ్బంది కోవిడ్ బారిన పడడం.. ఇవన్నీ చూసాక సినిమా రిలీజ్ వాయిదా వెయ్యక తప్పదని అనుకున్నామని.. సెకండ్ వేవ్ వచ్చేముందే సినిమా షూటింగ్ మేజర్ భాగం పూర్తయినా.. ఇంకా పది రోజుల షూటింగ్ మిగిలిపోయింది. పరిస్థితులు చక్కబడగానే మళ్లీ షూటింగ్ చేసి రిలీజ్ తేదీ ప్రకటిస్తామని అడివి శేష్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.