Advertisement
Google Ads BL

బాలయ్య కి కావాల్సింది అదే


బాలకృష్ణ బయట రాజకీయాల పరంగా అయినా, సినిమా ఈవెంట్స్ తో అయినా.. తండ్రి ఎన్టీఆర్ గురించి మొదలు పెట్టి రామాయణ, మహాభారత శ్లోకాల్లోకి వెళ్లిపోతుంటారు. ఆయన పలికే సంభాషణలు సామాన్యంగా ఎవరికి అర్ధం కావు. అసలు బాలకృష్ణ మాట్లాడే మాటలు అర్ధం చేసుకోవడం అంత ఈజీ కాదు. అలాంటి బాలకృష్ణ సినిమాల్లో భారీ డైలాగ్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పే విధానానికి ఫాన్స్ ఫిదా అవుతారు. బాలయ్య విలన్స్ కి చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ కి నందమూరి ఫాన్స్ పడిపోతారు. ఇక ఆయన ఈవెంట్స్ లో ఏం మాట్లాడబోయి ఏం మాట్లాడినా అదేదో రామకీర్తన అన్నట్టుగా వింటూ పరవశంలో మునిగిపోతారు. 

Advertisement
CJ Advs

బయట స్పష్టంగా మాట్లాడలేని బాలయ్య సినిమాల్లో అంత పవర్ ఫుల్గ్స్ డైలాగ్స్ ఎలా చెబుతారో అనేది అందరికి పెద్ద డౌట్. అయితే బాలకృష్ణకి ఇష్టమైన దేవుడి పధ్యాలు, సంస్కృత శ్లోకాలు ఇప్పుడు అఖండలో వినిపించబోతున్నాయట. అఖండ గా అఘోర పాత్రలో చెప్పే సంస్కృత శ్లోకాలు సినిమాకే హైలెట్ అనేలా ఉన్నాయట. ఆ శ్లోకాలని బాలకృష్ణ స్వయంగా పాట రూపంలో పాడారని వినికిడి. ఆ శ్లోకాలతో పాటుగా.. సందర్భానుచితం వివరణ కూడా ఇవ్వబోతున్నారట. మరి మాములుగా శ్లోకాలంటే బాలయ్యకి చాలా ఇష్టం. ఇప్పుడు ఆయన ఇష్టపడే ఆ శ్లోకాలు అఖండలో పెట్టారంటే.. ఆ పవర్ ఫుల్ శ్లోకాలను బాలయ్య నోటి వెంట వినాల్సిందే.  

Balakrishna to turn into a singer again :

Balakrishna to turn into a singer again for Akhanda
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs