తెలుగులో స్టార్ హీరోలతో యాంకరింగ్ చేస్తూ క్రేజీ గా మారిన బిగ్ బాస్ అంటే బుల్లితెర ప్రేక్షకులకి మహా ఇష్టం. ఎంతలా బిగ్ బాస్ తెలుగులో ప్రాచుర్యం పొందింది అంటే.. విలేజెస్ లో బిగ్ బాస్ ని ఒక్క క్షణం మిస్ అవకుండా చూస్తూ బిగ్ బాస్ అయ్యాక దానిపై డిబేట్స్ పెట్టేంత. అలా బిగ్ బాస్ లోకి ఇన్వాల్వ్ అయ్యేవారు చాలామంది ఉన్నారు. ఇక ఈ ఏడాది బిగ్ బాస్ మే నెలాఖరున మొదలు పెట్టేందుకు ప్రయత్నం చేసిన స్టార్ మా కి కరోనా సెకండ్ వేవ్ బిగ్ షాక్ ఇచ్చింది. దానితో కరోనా సెకండ్ వెవ్ తగ్గాక మొదలు పెట్టె యోచనలో బిగ్ బాస్ యాజమాన్యం ఉన్నట్లుగా వార్తలొచ్చాయి. అయితే తాజాగా బిగ్ బాస్ ని మొదలు పెట్టె ఏర్పాట్లలో ఇప్పుడు స్టార్ మా ఉన్నట్లుగా తెలుస్తుంది.
జూన్ చివరి వారంలో బిగ్ బాస్ ని స్టార్ మా లో మొదలు పెట్టే ఆలోచనలో స్టార్ మా ఉందట. దానిలో భాగంగా బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ని జూమ్ మీటింగ్ లో ఇంటర్వ్యూ లు చేస్తుందట బిగ్ బాస్ యాజమాన్యం. రోజు దాదాపుగా ముగ్గురు కంటెస్టెంట్స్ ఇంటర్వ్యూలని జూమ్ లో తీసుకుంటుందట బిగ్ బాస్ యాజమాన్యం. అలా జూమ్ మీటింగ్ లో సెలెక్ట్ చేసే వారిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపేముందు ఓ 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లోకి పంపి.. ఆ తరవాత హౌస్ లోకి పంపే ఏర్పాట్లలో యాజమాన్యం ఉందట. నాగార్జున హోస్ట్ చేస్తున్న సీజన్ 5 లో ఎక్కువగా యూట్యూబ్ స్టార్స్, టిక్ టాక్ స్టార్స్, అలాగే బుల్లితెర నటులు, ఓ ప్రముఖ యాంకర్ పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా టాక్.