Advertisement
Google Ads BL

ఇప్పుడు మట్లాడరేమిటి తంబీస్


ఫ్యామిలీ మ్యాన్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది మొదలు తమిళ తంబీలు సమంత ని టార్గెట్ చేసి.. ఫ్యామిలీ మ్యాన్ 2 లో సమంత తమిళులకు వ్యతిరేకంగా పోరాడింది.. అసలు అలాంటి కేరెక్టర్ చెయ్యడానికి సమంత కి సిగ్గులేదా అంటూ#ShameOnSamantha అనే హాష్ టాగ్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ తెగ రచ్చ చేసారు. అక్కడికి దర్శకుడు రాజ్ అండ్ డీకే వాళ్ళు చెబుతూనే ఉన్నారు. ట్రైలర్ చూసి ఓ అంచనాకు రావొద్దు సీరీస్ చూసి చెప్పండి. తమిళలులని అగౌరవపరిచేలా ఫ్యామిలీ మ్యాన్ లో ఏం లేదని చెప్పారు. అయినా ఫ్యామిలీ మ్యాన్ రిలీజ్ వరకు తమిళ తంబిల రచ్చ ఆగలేదు. కరోనా వలన వెనక్కి తగ్గారు కానీ.. లేదంటే నానా గొడవలే చేసేవారు. 

Advertisement
CJ Advs

ఇక కేంద్రానికి కూడా తమిళనాడు ప్రభుత్వం నుండి ఫ్యామిలీ మ్యాన్ ఆపాలంటూ లేఖ కూడా రాసారు.

అయితే రెండు రోజుల క్రితం అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ చూసాక తమిళ తంబీలు సైలెంట్ అయ్యారు. సమంత రాజి అనే శ్రీలంక LTT టెర్రరిస్ట్ గా దేశ ప్రధానిని చంపే వెపన్ గా నటించింది. కానీ తమిళ తంబిలను ఎక్కడా సమంత అన్నది లేదు, చేసింది లేదు. దానితో తమిళులు కామ్ అయ్యారు. నిన్నటివరకు సమంత ని టార్గెట్ చేసిన వారు ఇప్పుడు సోషల్ మీడియాలో కనబడితే ఒట్టు. తమ‌ని, త‌మ జాతినీ, త‌మ భాష‌నీ.. తమిళ చ‌రిత్ర‌నీ కించ‌ప‌రిచే లాగ ఈ సీరీస్ లో ఏం లేక‌పోవ‌డంతో తమిళ తంబీలు కిక్కురుమనడం లేదు.

Tamil People silent on Family Man 2 Issue:

Family Man Season 2, the controversy and clarification
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs