Advertisement
Google Ads BL

మగబిడ్డకు జన్మనిచ్చిన ప్రభాస్ హీరోయిన్


రానా తో లీడర్ సినిమాలో చక్కటి తెలుగమ్మాయిలా కనిపించి మెప్పించిన రిచా గంగోపాధ్యాయ ప్రభాస్ తో మిర్చి సినిమాలో క్లాసీ గర్ల్ లా కనిపించి.. రవితేజ మిరపకాయ్ సినిమాలో హోమ్లీ హీరోయిన్ గా సినిమాల్లో ప్రొజెక్ట్ అయ్యింది. అయితే సినిమాల్లో అవకాశాలు తగ్గగానే అమెరికా చెక్కేసి అక్కడ పై చదువులు చదువుతూనే బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ.. పెద్దల అంగీకారంతో అతనితో కలిసి ఏడడుగులు నడిచిన విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా అభినులకు తెలియజేసింది. రిచా గంగోపాధ్యాయ పెళ్లి తర్వాత చాలా తొందరగానే తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్నీ తెలియజేసింది.

Advertisement
CJ Advs

అయితే తాజాగా రిచా గంగోపాద్యాన పండంటి మెగా బిడ్డకి జన్మనిచ్చినట్లుగా తెలియజెయ్యడమే కాదు.. ఆ బిడ్డ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. రిచా తన బాబు కి లుకా షాన్‌ అనే పేరు పెట్టినట్లు సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. మా చిరు సంతోషం!! లుకా షాన్‌. మే 27న జన్మించాడు. చిన్నారి రాకతో మేమంతా ఎంతో ఆనందంగా ఉన్నాం. లుకా ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా, రూపురేఖల్లో అచ్చం తన నాన్నలాగానే ఉన్నాడు. లుకా.. నువ్వు మా జీవితాల్లో మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని నింపావు అంటూ కొడుకు పుట్టిన ఆనందాన్ని తన పోస్ట్ లో రాసింది.

Mirchi Heroine Richa Gangopadhyay delivers a baby boy:

Richa Gangopadhyay Blessed With Baby Boy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs