Advertisement
Google Ads BL

కార్తీక దీపం షాకింగ్ ట్విస్ట్


కార్తీక దీపం సీరియల్ లో కార్తీక్ - దీప కలిసిపోయారు. పదేళ్లుగా భర్యని అనుమానించిన  డాక్టర్ బాబు నిజం తెలుసుకుని భార్య వంటలక్కకి సారి చెప్పి హ్యాపీ లైఫ్ గడపబోతున్నాడనే ఆనందంలో బుల్లితెర ప్రేక్షకులు ఉన్నారు. టాప్ టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతున్న కార్తీక దీపంలో వంటలక్క - డాక్టర్ బాబు కలిసిపోతే అనే ప్రశ్న, ఆనందం ఎప్పటినుండో బుల్లితెర ప్రేక్షకుల్లో ఉంది. వంటలక్క అనారోగ్యంతో హాస్పిటల్ లో ప్రాణాలతో పోరాడుతున్న సమయంలో డాక్టర్ బాబుకి తన భార్య పతివ్రత అనే విషయం తెలియడంతో పడే మానసిక క్షోభ, అంతలో విలన్ మోనిత కుట్రలు.. ఇలా సాగుతున్న ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్.. దీప కి క్షమాపణలు చెప్పే టైం లో మోనిత ఎంట్రీ బుల్లితెర ప్రేక్షకుల ఆశలను అడియాశలు చేసింది.

Advertisement
CJ Advs

కార్తీక్, దీప కాళ్ళు పట్టుకుని సారి చెప్పబోయే టైం లో సడన్ గా ఎంట్రీ ఇచ్చిన మోనిత ఎందుకు కార్తీక్ మానవ తప్పిదంతో నీకు పిల్లలు పుట్టరని రిపోర్ట్ లతో దీప ని అనుమానించావ్.. కానీ నువ్వు తండ్రి అవుతావు, హిమ, శౌర్య నీ కన్న పిలల్ల ఆ విషయం చెప్పడానికే వచ్చాను. అని అత్తగారు సౌందర్య దగ్గర ఆశీర్వాదం తీయాసుకోబోతే.. నా కొడుకు తండ్రయితే నీకు ఆశీర్వాదం ఏమిటి మోనిత అని అడగగా.. ఎందుకంటే నేను ప్రెగ్నెంట్.. దానికి కారణం మీ అబ్బాయి కార్తీక్ అంటూ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చేసరికి బుల్లితెర ప్రేక్షకులకి షాక్ కొట్టింది. 

ఇక రేపటి ఎపిసోడ్ లో కార్తీక్ స్టోపిట్ మోనిత.. ఏం మాట్లాడుతున్నావ్ అని కార్తీక్ అరవగా.. నిజం కార్తీక్ నా కడుపుకి కారణం నువ్వే.. కావాలంటే ఈ రిపోర్ట్ చూసుకో నేను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది అని ఆ రిపోర్ట్ దేవుడి దగ్గర పెట్టి మోనిత వెళ్లిపోవడాన్ని చూపించారు. ఈ ట్విస్ట్ చూసి బుల్లితెర ప్రేక్షకులు బాబోయ్ కార్తీక దీపం కి శుభం కార్డు పడుతుంది అనుకుంటే.. ఇదేం ట్విస్ట్ రా నయానో అనుకుంటున్నారు.

Shocking twist in Karthika Deepam Serial:

Karthika Deepam gears up for a new twist
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs