Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ - కొరటాల ఓ సర్ప్రైజ్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ మూవీ తర్వాత కొరటాల శివ తో కమిట్ అయిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ పాన్ ఇండియా మూవీ చెయ్యని కారణంగా ఎన్టీఆర్ కొరటాలతో పాన్ ఇండియా మూవీ అనౌన్స్ చేసాడు. ఇక త్రివిక్రమ్ - మహేష్ కాంబోలో మూవీ ఫిక్స్ అయ్యింది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ స్క్రిప్ట్ విషయంలో కొరటాల చాలా సీరియస్ గా ఉన్నాడట. జనతా గ్యారేజ్ టైం లో ఎన్టీఆర్ కోసం మోహన్ లాల్ ని తీసుకొచ్చిన కొరటాల ఈసారి మరో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడట ఎన్టీఆర్ ఫాన్స్ కి. అదేమిటంటే ఎన్టీఆర్ సినిమా కోసం లేడి అమితాబ్ విజయశాంతి ని సంప్రదించాలనుకుంటున్నాడట కొరటాల. ఆచార్య షూటింగ్ ఆగడంతో కొరటాల ఎన్టీఆర్ స్క్రిప్ట్, అలాగే నటుల విషయాలను కూడా సెట్ చేసుకునే పనిలో ఉన్నాడట.

Advertisement
CJ Advs

పాన్ ఇండియా మూవీ కాబట్టి పలు భాషల నటులని ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేయబోతున్నారట. ఇప్పటికే కియారా అద్వానీ హీరోయిన్ గా ఫైనల్ అంటున్నారు. ఇక ఓ పవర్ ఫుల్ కీ రోల్ కోసం ఎన్టీఆర్ - కొరటాల విజయ్ శాంతి ఒప్పించి ఓకె చేయించుకోవాలనుకుంటున్నారట. మరి లేడీ అమితాబ్ మహేష్ సరిలేరు నీకెవ్వరూ తర్వాత పెద్దగా సినిమా చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు.  సరిలేరు నీకెవ్వరూ తర్వాత ఆమె దగ్గరకి చాలా పవర్ ఫుల్ రోల్స్ వెళ్ళినా ఆమె మాత్రం సున్నితంగా నో చెప్పేస్తుంది. మరి ఇప్పుడు ఎన్టీఆర్ కోసం అడిగితే విజయశాంతి ఒప్పుకుంటుందా అనే అనుమానం ఎన్టీఆర్ ఫాన్స్ లో అయితే ఉంది.

NTR-Koratala film to have powerful actress:

Vijayashanthi to do a powerful role in a Koratala-NTR movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs