Advertisement
Google Ads BL

బాలీవుడ్ స్టార్స్ ని వెనక్కి నెట్టిన రౌడీ స్టార్


ఆల్ ఇండియా టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ కొట్టేసిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ స్టార్స్ ను మించిన క్రేజ్, స్టార్ క్రికెటర్లను మించిన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు విజయ్ దేవరకొండ. ఈ టాలీవుడ్ స్టార్ రిసెంంట్ గా హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ గా టాప్ ప్లేస్ సంపాదించుకోగా.. ఇప్పుడు టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 50 లో నేషనల్ వైడ్ గా రెండో స్థానం దక్కించుకున్నారు.పోయిన సంవత్సరం మూడో ప్లేస్ లో ఉన్న విజయ్ ఇప్పుడు ఏకంగా రెండో స్థానానికి చేరుకున్నాడు. రన్వీర్ సింగ్, వికీ కౌషల్, రణ్ బీర్ కపూర్ లాంటి బాలీవుడ్ స్టార్స్ అంతా విజయ్ వెనకే ఉండిపోయారు.

Advertisement
CJ Advs

ఆన్ లైన్ ఓటింగ్, జ్యూరీ అభిప్రాయాల ఆధారంగా వివిధ రంగాల్లోని సెలబ్రిటీలను టాప్ 50 మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ తయారు చేసింది టైమ్స్ గ్రూప్. నేషనల్ వైడ్ గా జరిగిన ఆన్ లైన్ ఓటింగ్ లో దివంగత బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తొలి స్థానం దక్కించుకోగా...రెండో స్థానంలో విజయ్ దేవరకొండ నిలిచారు. ఆదిత్య రాయ్ కపూర్, వికీ కౌశల్, దుల్కర్ సల్మాన్ తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు. 

అర్జున్ రెడ్డి సినిమా హిందీ రీమేక్ కబీర్ సింగ్ తో బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ బాగా పరిచయం అయ్యారు. ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమా లైగర్ తో హిందీ పరిశ్రమకు విజయ్ దేవరకొండ మరింత దగ్గరవుతున్నారు. టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 50 లిస్ట్ లో విజయ్ సెకండ్ ప్లేస్ గెల్చుకోవడానికి తన ప్యాన్ ఇండియా స్టార్ ఇమేజ్ కూడా దోహదపడింది.దీనితో ఆయన చేస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా లైగర్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Vijay Deverakonda grabs 2nd place in all india times most desirable men 50 list:

Rowdy star Vijay Deverakonda grabs 2nd place in all india times most desirable men 50 list
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs