Advertisement
Google Ads BL

రంగస్థలం రామలక్ష్మిని మించి.. రాజి


ఎప్పుడూ గ్లామర్ గా కనిపించే సమంత రంగస్థలం లో రామలక్ష్మి పాత్రకి న్యాయం చేస్తుందా అనుకుంటే.. రామ లక్ష్మి పాత్రలో సమంత ని తప్ప మరొకరిని ఊహించలేం అన్నట్టుగా పెరఫార్మెన్స్ ఇచ్చింది. డీ గ్లామర్ లుక్ తోనే సమంత రామలక్ష్మి గా అదరగొట్టేసింది. ఆ సినిమాలో వ్యవసాయం చేసే అమ్మాయిగా, పనులు చేసుకునే పాత్రలో రామలక్ష్మి చిట్టిబాబుతో ప్రేమలో పడి.. రంగమ్మా మంగమ్మా అంటూ చేసిన రచ్చ అంతా ఇంతాకాదు. ఎప్పటికి సమంత కెరీర్ లో మరిచిపోలేని పాత్ర రామలక్ష్మి. ఇప్పుడు రామలక్ష్మికి మించి ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 లో రాజి పాత్రలో కనిపించింది సమంత. రాజ్ అండ్ డీకే దర్శకులు తెరకెక్కించిన ఫ్యామిలీ మ్యాన్ 2 గత రాత్రి నుండి అమెజాన్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది.

Advertisement
CJ Advs

ఆ వెబ్ సీరీస్ లో శ్రీకాంత్ గా మనోజ్ బజ్ పేయి క్లాస్ లుక్ లో కనిపించగా ప్రియమణి సుచిగా మనోజ్ వైఫ్ పాత్రలో కనిపిస్తుంది. అయితే ఈ సీరీస్ లో సౌత్ బ్యూటీ సమంత డీ గ్లామర్ గా LTT తీవ్రవాది గా కనిపించింది. తమ నాయకుల నుండి పిలుపొచ్చే వరకు ఒక నిస్సహాయమైన అమ్మాయిలా  స్పిన్నింగ్ మిల్‌లో పని చేస్తుంది. అక్కడి ఓనర్ వికృత చేష్టలు, బస్సులో ఆకతాయి చేష్టలను తట్టుకుంటూ అమాయకంగా కనిపించే రాజి.. ఆకతాయిని చంపేసే సీన్స్ హైలెట్ అనేలా ఉన్నాయి. అయితే రాజి పాత్రలో ఉన్న సమంత తమ నాయకుడు సుబ్బు మరణ వార్త విని ఆత్మహత్య చేసుకుందామనుకున్న  టైం లో నాయకుడి నుండి ఫోన్ రావడంతో యుద్దానికి సిద్దమవుతుంది.

సమంత యాక్షన్, ఆమె లుక్స్, ఆమె పెరఫార్మెన్స్ అన్ని రాజి పాత్రని ఫ్యామిలీ మ్యాన్ కే హైలెట్ అనేలా ఉంది. రాజీ తన నాయకుడు అప్పజెప్పిన మిషన్ కోసం పని చేసే అమ్మాయిగా అదరగొట్టేసింది. సమంత రంగస్థలంలో రామలక్ష్మి పాత్రకి మించి ఆమె ఫ్యామిలీ మ్యాన్ సీరీస్ లో చేసిన రాజి పాత్ర ఉంది అంటే నమ్మాలి. 

Rangasthalam Ramalakshmi vs Family man 2 Raji:

Family Man 2 makers on Samantha Akkineni: She took extreme risk to do this role, it is a brave choice
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs