Advertisement
Google Ads BL

ఈ ఇయర్ ప్రశాంత్ కి చాలా స్పెషల్


కన్నడ కెజిఎఫ్ సంచలనం ప్రశాంత్ నీల్ ఇప్పుడు టాలీవుడ్ హీరోల హాట్ ఫెవరేట్. కెజిఎఫ్ తో సంచనాలకు కేరాఫ్ లా మారిన ప్రశాంత్ నీల్ తో టాలీవుడ్ స్టార్ హీరోలు టయ్యప్ అయ్యారు. యశ్ తో తాను తీస్తున్న కెజిఎఫ్ 2 ఇంకా రిలీజ్ కాకుండా ప్రశాంత్ నీల్ తో సినిమాలు చెయ్యడానికి సౌత్ హీరోలు ఉవ్విళ్లూరుతున్నారు. హీరో ఎలివేషన్ సీన్స్ లో ప్రశాంత్ నీల్ అంత గొప్పగా హీరో ని ఎవరూ చూపించరనే అభిమానుల టాక్ పర్ఫెక్ట్ గా ఉండడంతో.. ఎన్టీఆర్, ప్రభాస్ రీసెంట్ గా అల్లు అర్జున్ లు ఆయనతో సినిమాలు చేసేందుకు వెంట పడుతున్నారు. కెజిఎఫ్ 2 రిలీజ్ కాలేదు. దాని టాక్ లేదు అప్పుడే ప్రభాస్ తో సలార్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఆతర్వాత ఎన్టీఆర్ 31 ని డైరెక్ట్ చెయ్యబోతున్నాడు. ఈమధ్యనే ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబో మూవీ అనౌన్సమెంట్ వచ్చేసింది.

Advertisement
CJ Advs

గత ఏడాది కెజిఎఫ్ తో ఇండియా వైడ్ గా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ కి టాలీవుడ్ హీరోల దగ్గరనుండి, కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కానీ ఈ ఏడాది ప్రభాస్ తోనూ, ఎన్టీఆర్ తోనూ మూవీస్ కమిట్ అయ్యి ప్రభాస్ ఫాన్స్, ఎన్టీఆర్ ఫాన్స్ కి ఫెవరేట్ డైరెక్టర్ గా మారిపోవడంతో టాలీవుడ్ నుండి లెక్కకు మించి బర్త్ డే విషెస్ ని తెలియజేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. గత ఏడాది నార్మల్ గా ఉన్న ప్రశాంత్ నీల్ నేడు టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి వెళ్ళిపోయి ఈ పుట్టిన రోజు శుభాకాంక్షలను ఎంజాయ్ చేస్తున్నాడు. అందుకే అనేది ఈ ఇయర్ ప్రశాంత్ నీల్ కి ఎంతో స్పెషల్ అని. ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న ప్రశాంత్ నీల్ కి సినీజోష్ టీం తరుపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే.

Prashanth Neel Birthday Special:

Kannada Director Prashanth Neel Birthday Special
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs