Advertisement
Google Ads BL

శర్వానంద్ డాక్టర్ అంట


టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం మహాసముద్రంతో పాటుగా ఆడవాళ్లు మీకు జోహార్లు అలాగే మరో రెండు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టాడు. అయితే ఎప్పుడూ గొడవలకు, కాంట్రవర్సీలకు దూరంగా ఉండే శర్వానంద్ ఈ మధ్యన శ్రీకారం మూవీ నిర్మాతలతో పారితోషకం విషయంలో పేచీ పడ్డాడని టాక్ నడిచింది. మహానుభవుడు సినిమా తర్వాత శర్వానంద్ చేసిన జానూ, శ్రీకారం మూవీలు బావుంది, హిట్ అన్నారు. కానీ కలెక్షన్స్ పరంగా శర్వానంద్ ని తీవ్ర నిరాశ పరిచాయి. ఆ తర్వాత మహా సముద్రం అనే మల్టీస్టారర్, రష్మిక మెయిన్ లీడ్ లో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటిస్తున్న శర్వానంద్ ఇప్పుడు డాక్టర్ అవతారమెత్తబోతున్నాడట. అది కూడా తన దోస్త్ భార్య కోసం.

Advertisement
CJ Advs

ఇండస్ట్రీలో శర్వానంద్ ప్రాణ స్నేహితుడైన రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల కోసం. ఉపాసన అనగానే అటు అపోలో హాస్పిటల్, ఇటు మెగా ఫ్యామిలీ కోడలిగా అందరికి పరిచయం ఉన్న పేరే. అపోలో హాస్పిటల్ లైఫ్ వైస్ చైర్ పర్సన్ గా ఉపాసన అటు హాస్పిటల్ కోసం పని చేస్తూ మరోపక్క ఫ్యామిలీ విషయాలను చూసుకుంటుంది. ఈమధ్యనే యు ఆర్ లైఫ్ అంటూ యూట్యూబ్ ఛానల్ లో డైట్ గురుంచి ప్రచారం చేసిన ఉపాసన ఇప్పుడు ఆరోగ్యపరమైన విషయాలను అందరితో పంచుకోవడానికి, అలాగే కరోనా సమయంలో డాక్టర్స్ పేషేంట్స్ కి అందిస్తున్న సేవలను కొనియాడుతూ ఓ షార్ట్ ఫిలిం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టిందట.

అయితే ఆ షార్ట్ ఫిలిం లో శర్వానంద్ యాక్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. కరోనా టైం లో డాక్టర్స్ చేసిన సేవలను, ఇంకా ఆరోగ్యపరమైన విషయాలను ఈ షార్ట్ ఫిలిం లోనే చూపించబోతున్నారట. ఈ షార్ట్ ఫిలిం లో శర్వానంద్ డాక్టర్ గా కనిపిస్తాడట. చరణ్ ఫ్రెండ్ గా శర్వా ఉపాసన అడగ్గానే ఈ డాక్టర్ కేరెక్టర్ చెయ్యడానికి రెడీ అయినట్లుగా తెలుస్తుంది.

Sharwanand turning doctor:

What for Sharwanand teaming with Upasana
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs