Advertisement
Google Ads BL

మోహన్ లాల్ అరుదైన రికార్డ్


మలయాళ నటుడు మోహన్ లాల్ అటు తమిళ్ ఇటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచుతుడే. ఆయన సినిమాలను తెలుగులో తెగ రీమేక్స్ చేస్తుంటారు. ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోలు.. మోహన్ లాల్ నటించిన సూపర్ హిట్ లూసిఫెర్ ని చిరు రీమేక్ చేస్తుండగా.. దృశ్యం 2 ని వెంకీ రీమేక్ చేసాడు. అయితే మోహన్ లాల్ - జీతూ జోసెఫ్ కాంబోలో తెరకెక్కిన దృశ్యం మూవీ ఒక అద్భుతం. అప్పట్లో ఆ దృశ్యం సినిమాని అన్ని భాషల హీరోలు రీమేక్స్ చేసి హిట్స్ కొట్టారు. ఇక అదే కాంబోలో దృశ్యం సీక్వెల్ గా దృశ్యం 2 వచ్చింది. గత ఏడాది లాక్ డౌన్ కరోనా పరిస్థితులు కారణముగా మోహనల్ దృశ్యం 2 మూవీ ఓటిటి నుండి నేరుగా విడుదలయ్యింది.

Advertisement
CJ Advs

అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన దృశ్యం 2 మూవీని అన్ని భాషల ప్రేక్షకులు అద్భుతం అన్నారు.  అంతేకాదు టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన రాజమౌళి ప్రత్యేకించి దృశ్యం మూవీని పొగిడేశారు. అలా సెలబ్రిటీస్ మన్ననలు అందుకున్న ఆ సినిమా ఓటిటి లో విడుదల కాగానే తెలుగు సీనియర్ హీరో వెంకీ దానిని తెలుగులో రీమేక్ చేసేసారు. అయితే ఇప్పుడు మోహన్ లాల్ దృశ్యం మూవీ ఓ రికార్డు సాధించింది. అదేమిటంటే ఈ యేడాది ఇప్పటి వరకు విడుదలైన చిత్రాల్లో IMDB 8.8 రేటింగ్ ఈ దృశ్యం 2 కి వచ్చింది. దాదాపుగా 94% ప్రజలు దృశ్యం సినిమాను లైక్ చెయ్యడంతో మోహన్ లాల్ ఈ సినిమాతో ఇంతటి అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నారు.

Drishyam 2 Most Rated Indian Movies On Imdb:

Mohanlal - Jeethu Joseph Drishyam 2 Most Rated Indian Movies On Imdb
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs