Advertisement
Google Ads BL

అమ్మతో పోల్చడం బాధ్యతను పెంచినట్టే


అందాలనటి, అతిలోక సుందరి శ్రీదేవి మరణించినా ఆమె పేరు ఎప్పటికప్పుడు హైలెట్ అవుతూనే ఉంది. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ని ఎక్కువగా తల్లి శ్రీదేవితో పోలుస్తుంటారు అభిమానులు. జాన్వీ కపూర్ నడిచినా, ఆమె మోడరన్ డ్రెస్ వేసినా, చీర కట్టినా, పెరఫార్మెన్స్ లోనూ ఇలా ప్రతి ఒక్క విషయంలో శ్రీదేవి తో జాన్వీ కపూర్ ని పోల్చడం మానరు. అయితే శ్రీదేవి తో పోలిస్తే జాన్వీ కపూర్ పెరఫార్మెన్స్ పరంగా ఇంకా చాలా ఎదగాలి. ఆమె సినిమాలు చూసి శ్రీదేవిలా చెయ్యలేదు, శ్రీదేవి అభిమానులని డిస్పాయింట్ చేసింది అనే టాక్ జాన్వీ నటించిన సినిమాలు రిలీజ్ అయినప్పుడు వింటూనే ఉంటాం. అయితే తాజాగా అమ్మతో పోల్చడం అనేది తనపై ఒత్తిడి పెంచదు బాధ్యతను మరింతగా పెంచుతుంది అని అంటుంది జాన్వీ కపూర్.

Advertisement
CJ Advs

ధఢక్ సినిమాతో, గుంజన్‌ సక్సేనా సినిమాలతో అభిమానులకి దగ్గరవుతున్న జాన్వీ కపూర్ అటు నటనలోనే కాదు.. ఇటు గ్లామర్ గానూ అదరగొట్టేస్తుంది. సెకండ్ వేవ్ ముందు మాల్దీవులలో జాన్వీ కపూర్ చేసిన బికినీ రచ్చ చూసిన నెటిజెన్స్.. అమ్మ జాన్వీ కాస్త సిల్వర్ స్క్రీన్ కోసం దాయి.. ఇలా బీచ్ ల వెంట ఫ్రీ షో చేయకు అనే సలహాలు ఇచ్చారు. ఇక నటన పరంగా తల్లి శ్రీదేవితో పోల్చినప్పుడు ఒత్తిడిగా అనిపించదు. అమ్మతో పోల్చడం ఓ అదృష్టంగా భావిస్తాను. ఇంతమంది అభిమానులని అమ్మే సంపాదించి పెట్టింది. అమ్మ నాకు ఎప్పటికి ఆదర్శమే. అమ్మంత కాకపోయినా నా పెరఫార్మెన్స్ తో ఫాన్స్ ను ఎప్పుడూ నిరాశ  పరచను. వారంతా నాలో అమ్మను చూసుకుంటున్నారు. అది నా లక్కు. అందుకే అమ్మతో పోలిస్తే నా బాద్యత మరింతగా పెరిగినట్టుగా ఫీలవుతాను అంటుంది జాన్వీ కపూర్.

Janhvi Kapoor recalls mom Sridevi told her to never depend on anyone:

Janhvi Kapoor has said that powerful women around her inspire her
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs