Advertisement
Google Ads BL

అదంతా రూమర్ అంటున్న ప్రభాస్ టీం


ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీ జాడ కనిపించడం లేదు. సాహో తర్వాత ప్రభాస్ చేసిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. సాహో సో సో ఫలితాన్ని ఇచ్చిన రాధేశ్యామ్ పై కూడా మంచిది అంచనాలే ఉన్నాయి. కాకపోతే పబ్లిసిటీ విషయంలో కాస్త వీక్ గా ఉన్న రాధేశ్యామ్ జులై 30 న రిలీజ్ కి ఇచ్చారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణముగా మరోసారి ఆ డేట్ మార్చుకునేలా ఉంది ఈ మూవీ. ఎందుకంటే ఇంకా ఓ సాంగ్ షూట్ చిత్రీకరణ బ్యాలెన్స్ ఉండగా.. విఎఫెక్స్ పనులు పెండింగ్ లో ఉన్నాయి. అయితే ఇప్పుడు రాధేశ్యామ్ గురించిన ఓ వార్త హైలెట్ అవుతుంది.

Advertisement
CJ Advs

అది సల్మాన్ ఖాన్ రాధే సినిమాలాగే ప్రభాస్ రాధేశ్యామ్ కూడా ఓటిటి బాట పట్టబోతోంది అని, దేశంలో లాక్ డౌన్ టైం లో సల్మాన్ ఖాన్ తన రాధే మూవీ జీ ప్లెక్స్ ఓటిటి నుండి రిలీజ్ చేసాడు. ఆ సినిమా ఫలితమెలా ఉన్నా ఇప్పుడు చాలామంది బాలీవుడ్ హీరోలు ఓటిటి దారిలో నడవబోతున్నారనే టాక్ వినిపిస్తుండగా.. ప్రభాస్ రాధేశ్యామ్ కూడా ఓటిటి నుండి విడుదలయ్యే ఛాన్స్ ఉంది అని, ప్రముఖ ఓటిటి సంస్థ జీ ప్లెక్స్ రాధేశ్యాం కి భారీ ఆఫర్ ఇచ్చింది అంటూ ప్రచారం జరుగుతుంది. కానీ ఆ వార్తలని రాధేశ్యామ్ టీం కొట్టిపారేస్తుంది. థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అయినా రాధేశ్యామ్ థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తాం అని, ఈ సినిమా థియేటర్స్ లోనే చూడాలని.. అప్పుడే మజా ఉంటుంది అంటుంది రాధేశ్యాం టీం.

Prabhas Radhe Shyam Confirmed for OTT?:

Will Radhe Shyam agree to a hybrid release offer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs