Advertisement
Google Ads BL

లవ్ సమంత vs హేట్ సమంత


సౌత్ గ్లామర్ డాల్ అక్కినేని సమంత ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటుంది. అదేమిటంటే #WeLoveSamantha vs #ShameOnYouSamantha వార్ లో సమంత చిక్కుకుంది. దానికి కారణం లేకపోలేదు. ట్విట్టర్ లో ఓ వర్గం ప్రేక్షకులు సమంత కి ప్రేమతో స్వాగతం పలుకుతూ #WeLoveSamantha అంటూ ట్వీట్స్ చేస్తుంటే.. మరో వర్గం ప్రేక్షకులు సమంత ని హేట్ చేస్తూ.. #ShameOnYouSamanth అంటూ ట్వీట్స్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. ఇదంతా ఆమె నటించిన ఫ్యామిలీ మ్యాన్ కాంట్రవర్సీ వలన. ఫ్యామిలీ మ్యాన్ 2 లో తమిళ కి వ్యతిరేఖంగా పోరాడిన LTT తీవ్రవాదిగా సమంత నటించడాన్ని, ఆమె కేరెక్టర్ ని తమిళులు సహించలేకపోయారు. ఫామిలీ మ్యాన్ ట్రైలర్ రిలీజ్ అయినప్పటినుండి సమంత ని అలాగే ఫ్యామిలీ మ్యాన్ సీరీస్ ని హేట్ చేస్తున్నారు తమిళియన్స్. అందుకే #ShameOnYouSamantha, #HateSamantha #FamilyMan2AgainstTamils హాష్ టాగ్స్ ట్రేడ్ చేస్తున్నారు.

Advertisement
CJ Advs

కానీ సౌత్ ఇండియా లో సమంత ని లైక్ చేసే ప్రేక్షకులు మాత్రం #WeLoveSamantha, #SupportSamantha హాష్ టాగ్స్ ట్రెండ్ చేస్తూ సమంతకి మద్దతు తెలుపుతున్నారు. సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ జూన్ 4 అంటే రేపు అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతుంది. దానిని అడ్డుకోవాలంటూ తమిళులు సమంత కి వ్యతిరేఖంగా నినాదాలు చేస్తూ #ShameOnYouSamantha హాష్ టాగ్స్ ని ట్రెండ్ చేస్తుంటే.. సమంత కి సపోర్ట్ అంటూ సమంత ని లవ్ చేసే అభిమానులు  #WeLoveSamantha హాష్ టాగ్ ని ట్రెండ్ చెయ్యడంతో ప్రస్తుతం ట్విట్టర్ లో #WeLoveSamantha vs #ShameOnYouSamantha హాష్ టాగ్ వార్ జరుగుతుంది. 

Samantha vs Samantha:

#WeLoveSamantha vs #ShameOnYouSamantha hashtag war on Twitter
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs