Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ - చరణ్ ఫాన్స్ ఫీలవుతున్నారు


ఈ రోజు ఉదయం టైమ్స్ అఫ్ ఇండియా హైదరాబాద్ టైమ్స్ వారు మోస్ట్ డిజైరబుల్ మేన్స్ 20220 జాబితాని రిలీజ్ చెయ్యగా అందులో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నెంబర్ వన్ ప్లేస్ ఆక్రమించగా.. హీరో రామ్ సెకండ్ ప్లేస్ ని ఆక్రమించి మెగా, నందమూరి ఫాన్స్ కి షాకిచ్చాడు. ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా లెవల్లో అల్లూరి సీతారామరాజుగా, కొమరం భీం గా క్రేజ్ సంపాదించినా ఎన్టీఆర్, రామ్ చరణ్ లు మూడు నాలుగు ప్లేస్ లలో ఉండడాన్ని మెగా అండ్ నందమూరి ఫాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. రామ్ కూడా సెకండ్ ప్లేస్ లోకి వచ్చేసాడు. కానీ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఇలా మూడు నాలుగు స్థానాలను సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ లుక్స్ తోనే సోషల్ మీడియాని షేక్ చేసారు.

Advertisement
CJ Advs

రౌడీ బ్రాండ్స్ విజయ్ దేవరకొండ మోస్ట్ డిజరబుల్ మెన్ గా ఫస్ట్ ప్లేస్ ఓకె.. కనీసం ఎన్టీఆర్ , రామ్ చరణ్ లలో ఎవరో ఒకరు సెకండ్ ప్లేస్ వస్తే బావుండేది అంటున్నారు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే గత ఏడాది 19 వ ప్లేస్ లో ఉన్న ఎన్టీఆర్ ఈసారి మూడో స్థానానికి ఎగబాకాడు. అందుకు కాస్త ఎన్టీఆర్ ఫాన్స్ హ్యాపీనే. ఎన్టీఆర్ కొమరం భీం గా సిక్స్ ప్యాక్ లుక్ తో ఆర్.ఆర్.ఆర్ లో అదరగొట్టెయ్యడం ఖాయం. అలాగే అల్లూరిగా రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ వీడియో తో సెన్సేషన్ క్రియేట్ చేసాడు. అలాంటిది వీరికి 3, 4 ప్లేసెస్ ఏమిటి బ్రో అంటూ తెగ ఇదైపోతున్నారు. టాప్ 5 లో ఆర్.ఆర్.ఆర్ స్టార్స్ ని చూసి ముచ్చటపడాల్సింది పోయి ఇలా ఫీలవడం ఏమిటి ఫాన్స్ అంటున్నారు నెటిజెన్స్.

Ntr and Ram charan fans disappointed:

Top 10 Hyderabad Times Most Desirable Men 2020
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs