Advertisement
Google Ads BL

సామ్ స్పీడు కి షాకవుతున్న ఫాన్స్


సమంత లేటెస్ట్ వెబ్ సీరీస్ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ మరికొద్ది గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ప్రస్తుతం సమంత చేతిలో తెలుగు నుండి శాకుంతలం పాన్ ఇండియా ఫిలిం ఉంది. తమిళంలో మరో మూవీలో నటిస్తుంది. అయితే లాక్ డౌన్, కరోనా అంటూ శాకుంతలం స్టార్ట్ అయినా.. జస్ట్ సెట్స్ వేసుకుంటూ.. సమంత శాకుంతలం లుక్ టెస్ట్, కాస్త్యుమ్స్ డిజైన్ అంటూ టైం గడిచిపోయింది. శాకుంతలం షూటింగ్ ఏదో ఓ చిన్నపాటి షెడ్యూల్ అయ్యుంటుంది. కరోనా సెకండ్ వేవ్ తో ప్రస్తుతం షూటింగ్ కూడా జరగడం లేదనుకున్న వారికి శాకుంతలం డైరెక్టర్ గుణశేఖర్ షాకిచ్చారు. 

Advertisement
CJ Advs

అంటే శాకుంతలం మూవీని సమంత సహకారంతో 50 శాతం పూర్తి చేశామంటున్నారాయన. శాకుంతలం లో సమంత శకుంతలగాను, దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటిస్తున్నారు. అయితే సెకండ్ వేవ్ తో తెలంగాణ గవర్మెంట్ మే 10 న లాక్ డౌన్ పెట్టేవరకు శాకుంతలం షూటింగ్ జరుగుతూనే ఉంది. ఆ తరువాత కరోనా ప్రభావం పెరగడంతో శాకుంతలం షూటింగ్ ఆపేశాము. ఇప్పుడు మరోసారి తెలంగాణ ప్రభుత్వం మధ్యాహ్నం వరకూ లాక్ డౌన్ సడలింపు సమయం ఇచ్చారు కనుక.. ఆ సమయంలోను షూటింగు చేస్తూ వెళ్లాలని అనుకుంటున్నాము. నిర్మాతలకు నష్టం రాకూడదనే ఉద్దేశంతో, టాప్ హీరోయిన్ అయ్యుండి సమంత అందిస్తున్న సహాయ సహకారాలు మరువలేనివి. 

సమంత వల్లనే శాకుంతలం 50 శాతం వరకూ చిత్రీకరణను పూర్తిచేయగలిగాము.. అంటూ శాకుంతలం పాన్ ఇండియా మూవీ 50 పర్సెంట్ చక్కబెట్టేసినట్లుగా చెప్పి సామ్ అభిమానులకి షాకిచ్చారు. సమంత కి ఎంతగా డెడికేషన్ లేకపోతె ఇలా కరోనా టైం లొనూ శాకుంతలం షూటింగ్ ని చకచకా కానిచేస్తుంది అంటూ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Shakuntalam Movie Update:

Gunashekar about Samantha Akkineni
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs