Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ గా


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొమరం భీం గా ఆర్.ఆర్.ఆర్ లో పవర్ ఫుల్ పాత్రని పోషిస్తున్నాడు. ఆ తర్వాత కొరటాల శివ సినిమాలో కాస్త స్టైలిష్ గా టక్ చేసుకుని నీట్ గా ఫామిలీ హీరోలా కనిపించబోతున్నాడు. ఆర్.ఆర్.ఆర్ లో ఎమోషనల్ గా బరువైన కేరెక్టర్ నుండి కొరటాల మూవీ లోకి కూల్ గా ఎంటర్ కాబోతున్నాడు. అయితే ఎన్టీఆర్ కొరటాల తర్వాత చెయ్యబోయే పాన్ ఇండియా ఫిలిం ప్రశాంత్ నీల్ తో కమిట్ అయ్యాడు. ప్రశాంత్ నీల్ మూవీ అంటే హీరో ఎలివేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. దానితో ఎన్టీఆర్ లుక్ అండ్ కథపై ఎన్టీఆర్ ఫాన్స్ లో ఇంట్రెస్ట్ అంతకంతకు పెరిగిపోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో ఇటీవలే కథా చర్చలు ముగిశాయని, పాన్ ఇండియా మూవీగా భారీ ఎత్తున ఈ సినిమాను తెరక్కించబోతున్నారని అంటున్నారు. 

Advertisement
CJ Advs

అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ని పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ గా ప్రశాంత్ వర్మ చూపించబోతున్నాడట. ఎన్టీఆర్ ని అలా పొలిటీషియన్ గా చూసాక ఎన్టీఆర్ ఫాన్స్ ఆగరని, థియేటర్స్ లో సీట్స్ ఎక్కి మరీ విజిల్స్ వేసేలా ఎన్టీఆర్ లుక్ ని, ఆయన పాత్రని ప్రశాంత్ నీల్ డిజైన్ చేస్తున్నాడట. అలాగే మరోపక్క ప్రపంచాన్నే గడగడలాడించే పవర్‌ఫుల్ మాఫియా డాన్‌లా తారక్ ని కెజిఎఫ్ డైరెక్టర్ చూపించబోతున్నారని, అలాగే జవాన్‌గా తారక్ కనిపించబోతున్నారని రకరకాలుగా ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కథలు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. 

మరి ప్రస్తుతం కెజిఎఫ్ ని రిలీజ్ చేసే ప్రయత్నాల్లో ఉన్న ప్రశాంత్ నీల్.. తర్వాత సలార్ తో ప్రభాస్ ని మాస్ గా చూపించేలా ప్లాన్ చేసుకుని.. ఊర మాస్ ప్రభాస్ సలార్ లుక్ వదిలి సినిమాపై అంచనాలు పెంచేసాడు. ఇక ఇప్పుడు తారక్ వంతు. అంటే తారక్ ని ప్రశాంత్ నీల్ ఎలా చూపించబోతున్నాడో అనే క్యూరియాసిటిలో ఎన్టీఆర్ ఫాన్స్ కొట్టేసుకుంటున్నారు.

NTR To Will Play Politician In KGF Director Prashanth Neel Movie:

Two crazy backdrops for the NTR-Prashanth Neel film 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs