Advertisement
Google Ads BL

బిగ్ బాస్ బ్యూటీ దివి బ్రేకప్ స్టోరీ


మహర్షి లాంటి సినిమాలో హీరోయిన్ కి ఫ్రెండ్ గా కనిపించినా రాని ఫేమ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళగానే వచ్చేసింది దివికి. హీరోయిన్ మెటీరియల్ అయినా.. ఆమె హైట్ ఆమెని హీరోయిన్ కాకుండా అడ్డుకుంటుంది. బిగ్ బాస్ లో చిట్టి పొట్టి డ్రెస్సులతో ఆకట్టుకున్న దివికి బయటికొచ్చాక చిరు వేదాళం నుండి మెగా ఆఫర్ తగిలింది. ఇంకా క్యాబ్ స్టోరీస్ లో హీరోయిన్ గా నటించిన దివి కి చాలా సినిమాల ఆఫర్స్ ఉన్నాయి. అయితే తాజాగా దివి తన ప్రేమ, బ్రేకప్ స్టోరీలపై స్పందించింది. తాను కొన్ని రోజులు ఒకిరితో ప్రేమలో ఉన్నాను అని, తర్వాత బ్రేకప్ అయ్యింది అని ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నాను అంటుంది దివి.

Advertisement
CJ Advs

తాను సింగిల్ గా ఉండడమే బావుంది అని, ఇలా ఉంటేనే నచ్చినట్లుగా ఎలా కావాలంటే అలా బ్రతకొచ్చు అని, అందుకే సింగిల్ గా ఉండడమే బెటర్ అంటుంది. ఇక లవ్ లో ఉన్నప్పుడు కరెక్ట్ గానే ఉన్నా అంటున్న దివి తన బ్రేకప్ కి కారణాలు చెప్పుకొచ్చింది. శశికాంత్, దేవిక వైద్య వాళ్ల కొడుకునే దివి ప్రేమించిందని దివి వాళ్ల పేరెంట్స్ చెబుతున్నారు. అయితే కొన్ని కారణాల వలన వాళ్ళ ప్రేమ బ్రేకప్ అయ్యింది అని అంటున్నారు. ఇక దివి ప్రేమించిన కుర్రాడు తమ్ముడు చనిపోవడంతో అతను పల్లెటూరికి వెళ్ళిపోయి దివి ని పెళ్లి చేసుకుని పల్లెటూర్లో ఉండాలని అడగగా.. తాను ఎప్పుడూ హైదరాబాద్ లోనే ఉండేదాన్ని అని, ఇక్కడి వాతావరణంలో పెరిగి మళ్లీ పల్లెటూరులో ఉండలేనేమో అనుకున్నా.. తర్వాత తనకు ఇష్టమైన మోడలింగ్ మానేయాలంటూ కోరాడని.. అది నచ్చక అతన్నే వదిలేసానని చెప్పింది దివి.

ఇక తనని పెళ్లి చేసుకునేవాడు 6.3 ఉండాలని, తనని బాగా చూసుకుని, కష్ట సుఖాల్లో తోడు ఉండేవాడైతే పెళ్ళికి రేడి అంటుంది దివి.

Bigg Boss Beauty Divi Breakup Story :

Divi Opens Up About Her Love And BreakUp Story
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs