Advertisement
Google Ads BL

RRR డేట్ మారడం పక్కా


రామ్ చరణ్ - ఎన్టీఆర్ కాంబోలో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ ఒకసారి షూటింగ్ లేట్ అవడం వలన పోస్ట్ పోన్ అవగా.. మరోసారి కరోనా కారణముగా వాయిదా పడి చివరికి అక్టోబర్ 13 న పక్కాగా రిలీజ్ చేసేందుకు ఆర్.ఆర్.ఆర్ టీం శతవిధాలా ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం సెకండ్ వేవ్ కారణముగా షూటింగ్ చివరి షెడ్యూల్ వాయిదా పడింది. తెలంగాణాలో లాక్ డౌన్ ఎత్తివేయగానే జూన్ మూడో వారం నుండి కొత్త షెడ్యూల్ కి ప్లాన్ చేస్తుందట టీం. అంటే ఆర్.ఆర్. ఆర్ లో ఇంకా రెండు పాటల బ్యాలెన్స్ ఉంది. ప్రస్తుతం ఆ రెండు పాటల చిత్రీకరణ కోసం 40 నుండి 50 రోజులు పడుతుంది అని.. ఒకేవేళ ఈ నెలాఖరు నుండి ఆ పాటల చిత్రీకరణ జరిగినా.. సినిమా అయితే అనుకున్న టైం కి రావడం అవ్వదు అంటున్నారు.

Advertisement
CJ Advs

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల ఇంట్రడ్యూసింగ్ సాంగ్ చిత్రీకరణ పూర్తి కావడానికి కనీసం 30రోజులు పడుతుందని.. అలాగే మరో డ్యూయెట్ రామ్ చరణ్ - అలియా భట్ మీద చిత్రీకరించాల్సి ఉందట. సో అలా చూసుకుంటే సినిమా అక్టోబర్ 13 న రావడం అనేది కలే అంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ లాస్ట్ షెడ్యూల్ కోసం బ్లూ ప్రింట్స్ అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో రాజమౌళి తలమునకలై ఉన్నారట. ఎట్టిపరిస్థితుల్లో ఈసారి డేట్ మారకూడదని ఎన్ని చేస్తున్నా.. మరోసారి ఆర్.ఆర్.ఆర్ డేట్ మారడం మాత్రం పక్కాగా కనిపిస్తుంది. `

RRR Postponed Again?:

RRR Postponed Again? Due Covid 19
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs