ఈమధ్యన కీర్తి సురేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటో చూసిన వారు కీర్తి సురేష్ ఫేస్ పై ట్రోల్ చేస్తున్నారు. బబ్లీగా అందంగా ఉండే అమ్మాయి ఫేస్ లో కళ పోగొట్టుకుంది అని, సన్నగా మారు కానీ మొహం లో గ్లో పోగొట్టుకోకు అంటూ నెటిజెన్స్ కీర్తి సురేష్ కి సలహాలిస్తున్నారు. ఇక ఈమధ్యన తరుచూ యోగాసనాల ఫొటోస్, వీడియోస్ పెడుతున్న కీర్తి సురేష్ కి నెటిజెన్స్ కామెంట్స్ అన్ని తెలుస్తున్నాయి. అప్పుడెప్పుడో మీరు కంగారు పడకండి.. నేను మళ్ళీ వెయిట్ పెరుగుతాను. నా లుక్ చేంజ్ చేసుకుంటాను. మిస్ ఇండియా మూవీ కోసం వెయిట్ లాస్ అయ్యినట్లుగా చెప్పింది.
కానీ కీర్తి సురేష్ ఇంకా ఇంకా నాజూగ్గా తయారవుతుంది. అంతేకాదు ఫేస్ లోని కళ మరింతగా పోగొట్టుకుంది. తాజాగా కీర్తి సురేష్ రెండు యోగాసనం వేసిన పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మరి ఫేస్ చూపించడం ఎందుకు అనుకుందో.. లేదంటే ఎర్లీ మార్నింగ్ ఫోటో గ్రఫీ అలానే ఉందొ కానీ.. కీర్తి సురేష్ ఫేస్ కనిపించకుండా కేవలం యోగాసనాలను చూపిస్తూ ఉన్న పిక్స్ ని పోస్ట్ చేసింది. దానిని చూసిన అందరూ కీర్తి సురేష్ ఈసారి ట్రోల్ అవకుండా ఫేస్ ని కవర్ చేసుకుందిగా అంటున్నారు.